పాన్‌కార్డు అనేది దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఓ గుర్తింపు కార్డు. పదంకెల ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య కలిగిన ఈ పాన్‌కార్డు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. ఇన్‌కంటాక్స్ దాఖలు చేసేవారికి ఇదొక తప్పనిసరి పత్రం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్‌కార్డు అనేది సాధారణంగా ఓ కంప్యూటర్ ఆధారిత జారీ కార్డు. ట్యాక్స్ పేయర్లకు అవసరమైన తప్పనిసరి కార్డు. ఆ వ్యక్తి ట్యాక్స్ సంబంధిత వివరాలు పాన్‌కార్డులో నిక్షిప్తమౌతుంటాయి. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దేశంలో ఒక వ్యక్తికి ఒకటే ఉండాలి. పాన్‌కార్డులో పాన్ నెంబర్, పేరు, పుట్టినతేదీ, తండ్రి లేదా భర్త పేరు, ఫోటో ఉంటాయి. ఈ కార్డును ఐడీ కార్డుగా లేదా పుట్టినతేదీ నిర్దారణ పత్రంగా ఉపయోగించవచ్చు. 


పాన్‌కార్డు జీవితమొత్తానికి వర్తిస్తుంది. అయితే చిన్న పొరపాటు చేసినా మీ పాన్‌కార్డు నిష్ప్రయోజనమౌతుంది. వాస్తవానికి ఆదాయపు శాఖ చాలా కాలంగా పాన్‌కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కోరుతోంది. దీనికి సంబంధించి ఆదాయపు శాఖ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. వివిధ రకాలుగా అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిన చివరి తేదీ ఇప్పుడు మరోసారి పొడిగించి..2023 మార్చ్ 31 వరకూ చేశారు. 


ఆదాయపు శాఖ అందించే వివరాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మార్చ్ 31, 2023 వరకూ తమ పాన్‌కార్డును 2023 మార్చ్ 31లోగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఆ పాన్‌కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఆధార్ కార్డు లింక్ లేని పాన్‌కార్డు పనిచేయదు. ఇన్‌కంటాక్స్ దాఖలు చేయడం కూడా సాధ్యం కాదు. ఆధార్ కార్డు లింక్ చేయడంలో చిన్న పొరపాటు చేసినా పాన్‌కార్డు నిష్ప్రయోజమౌతుంది.


Also read: Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook