Paytm Credit Card Charges: మీరు డిజిటల్ చెల్లింపులు(Digital Payment)  చేయడానికి Paytm APPను ఉపయోగిస్తే, మీరు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే తాజాగా ఛార్జీలను పెంచేశారు. నేడు మనం పెట్రోల్ బంక్ నుండి మొదలుకుని కిరాణా దుకాణాలు, మొబైల్ రీఛార్జీలు, వాటర్ బిల్లులు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, మూవీ టికెట్ బుకింగ్, మాల్స్ నుండి షాపింగ్ చేయడం లేదా డబ్బు లావాదేవీలకు పేటీఎంను  ఉపయోగిస్తున్నారు. తాజాగా వాలెట్ ఛార్జీలను పేటీఎం పెంచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మీ క్రెడిట్ కార్డుతో పేటీఎం యాప్‌ వాలెట్(Paytm Wallet)కు నగదు జమ చేస్తుంటాం. దీనికి గతంలో 2 శాతం వరకు ఛార్జీని వసూలు చేసేవారు. తాజాగా దీన్ని 2.5 శాతానికి పెంచింది పేటీఎం సంస్థ. Paytm వెబ్‌సైట్ ప్రకారం, ఒక వినియోగదారుడు క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్‌కు డబ్బు జమ చేస్తే.. 2.5 శాతం అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. 


Also Read: Gold Price Today 05 February 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన Gold Price, క్షీణించిన Silver Rate



జనవరి 15, 2021 నుండి పేటీఎం యాప్ ఈ ఛార్జీల పెంపును అమలుచేస్తోంది. అయితే చాలా కొద్ది మంది పేటీఎం వినియోగదారులకు ఈ విషయం తెలుసు. కొత్త నిబంధన అమలు తరువాత నుంచి ఒకవేళ మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డుతో Paytm Walletకు నగదు జమ చేస్తే 3 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు. గ్యాస్ సిలిండర్(LPG Cylinder) బుకింగ్ కూడా చేసుకోవచ్చునని తెలిసిందే.


Also Read: SBI ఖాతాదారులకు State Bank of India గుడ్ న్యూస్, ఇకపై ఇంటి వద్ద నుంచే ఆ సేవలు



గతంలో ఎలాంటి ఛార్జీలు లేకుండా పేటీఎం వ్యాలెట్‌కు నగదు జమ అయ్యేది. అయితే అక్టోబర్ 15, 2020 నుండి ఛార్జీలు అమలు చేశారు. క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బును జమ చేసేందుకు ఛార్జీలు తీసుకొచ్చి కొత్త నిబంధనల్ని పేటీఎం అమలు చేస్తోంది. గత అక్టోబర్ నుంచి Paytm మొబైల్ వాలెట్ క్రెడిట్ కార్డు ఉపయోగించి జత చేసిన నగదుపై వసూలు చేస్తున్న 2 శాతం అదనపు ఛార్జీలను తాజాగా 2.5 శాతానికి పెంచినట్లు వినియోగదారులు గుర్తించాలి.


Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి



నెట్‌బ్యాకింగ్ నుండి డబ్బును బదిలీ చేయడానికి లేదా జమ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. అదే విధంగా డెబిట్ కార్డ్ ద్వారా పేటీఎం వాలెట్‌లో డబ్బు జమ చేసేందుకు ఎలాంటి ఛార్జీలను పేటీఎం వసూలు చేయదు.
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook