Paytm Payments Bank Refund Fastag Extra Charge If Deduct: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్ట్ ట్యాగ్(FASTag) లేకుండా ఏ జాతీయ లేదా రాష్ట్ర రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే టోల్ ప్లాజా వద్ద జరిమానా సహా రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తారని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Paytm Payments Bankతో డబ్బు రిటర్న్
ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసి ఒక వారం గడిచింది. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేశారని ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు. ఫాస్టాగ్  తీసుకోవడానికి ప్రభుత్వం పలు బ్యాంకులు మరియు మొబైల్ యాప్‌లకు అవకాశం ఇచ్చింది. పలువురు Paytm నుండి FASTag తీసుకున్నారు. అయినా మీ ఫాస్టాగ్ ఖాతా నుండి అకారణంగా లేదా ఎక్కువ డబ్బు డెబిట్ అయితే  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(Paytm Payments Bank) వాటిని తిరిగి చెల్లిస్తుంది. 


Also Read: Ghatkesar Pharmacy Student Suicide: ఘట్‌కేసర్‌ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య, Kidnap డ్రామాతో ఇటీవల సంచలనం


ఇలా జరిగిన సందర్భాలలో ఇదివరకే 2.6 లక్షలకు పైగా వినియోగదారులకు అనవసరంగా ఖాతా డెబిట్ అయిన నగదును తిరిగి చెల్లించిందని పేటీఎం పేర్కొంది. గణాంకాల విషయానికొస్తే 82 శాతం మంది వాహనదారులకు ఎక్స్‌ట్రా కట్ అయిన ఛార్జీలను తిరిగి చెల్లించింది. టోల్ ప్లాజాలపై వస్తున్న ఫిర్యాదులు సహా ఇతరుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా తమ వినియోగదారులకు సహాయం అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు.


Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు


కనీస నగదు (Minimum Balance) అవసరం లేదు
ఫాస్టాగ్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ నియమాన్ని సైతం రద్దు చేశారు. ఇక నుంచి వాహనదారులు ఫాస్టాగ్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ కచ్చితంగా ఉంచాలని అవసరం లేదని ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ఫాస్టాగ్ ద్వారా వాహనాల ప్రయాణాన్ని వేగవంతం చేయడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. తద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ప్రయాణించేలా చూడవచ్చని మరియు తద్వారా టోల్ ప్లాజాకు తక్కువ సమయం పడుతుందని NHAI తెలిపింది.


Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త


కాగా, ఫాస్టాగ్‌ను అమలు చేసిన కొత్తలో మినిమం బ్యాలెన్స్ లేకపోయేసరికి ఆ ఖాతాల నుంచి నగదు జరిమానాలుగా వసూలు చేశారు. మినిమం బ్యాలెన్స్ లేనివారు టోల్ ప్లాజాల ద్వారా రాష్ట్ర లేదా జాతీయ రహదారుల గుండా ప్రయాణం చేయలేకపోయారు. తద్వారా టోల్ సిబ్బందితో పాటు వాహనదారులు అవస్తలు ఎదుర్కొన్నారు. సమయం సైతం వృథా అయింది. ఇప్పుడు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్‌కు అదనంగా కనీస బ్యాలెన్స్(Minimum Balance) ఉంచడం తప్పనిసరి కాదని శుభవార్త అందించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook