Ghatkesar Pharmacy Student Suicide Latest Updates: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపేలా కిడ్నాప్, ఆత్యాచారయత్నం డ్రామా ఆడిన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తనను ఆటోడ్రైవర్, కొందరు కలిసి అపహరించారని, తనపై అత్యాచారయత్నం చేయబోయారిన పోలీసులను తప్పుదోవ పట్టించిన బీఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం చెందడం సంచలనంగా మారింది.
కిడ్నాప్ ఘటన జరిగిన తరువాత ఆ యువతి తన మేనమామ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం షుగర్ ట్యాబ్లెట్లు, కొన్ని మాత్రలు మింగింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించడంతో పాటు ఆటోడ్రైవర్లను అవమానాలకు గురి చేసిన ఘట్‌కేసర్(Ghatkesar) విద్యార్థినిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని హాట్ టాపిక్ అవుతున్న క్రమంలో విద్యార్థిని ఆత్మహత్య(Pharmacy Student Suicide) చేసుకుంది.
Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు
ఫిబ్రవరి 10వ తేదీన కాలేజీకి వెళ్లిన తమ కూతురు ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ఘట్‌కేసర్‌కు చెందని మహిళ పదే పదే ఫోన్ చేసింది. దాంతో తల్లిని నమ్మించేందుకు తనను కొందరు కిడ్నాప్ చేశారని, రక్షించాలని కోరుతూ తల్లికి ఫోన్ చేసింది. ఆ వెంటనే విద్యార్థిని తల్లి డయల్ 100(Dial 100)కు కాల్ చేసి ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త
రాత్రి దాదాపు 7.45 గంటల ప్రాంతంలో అన్నోజిగూడ రైల్వేగేట్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిని అపస్మారక స్థితిలో పోలీసులు గుర్తించారు. యువతి కాలికి గాయాలైనట్లు గుర్తించిన పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తాను ప్రతిఘటించడం, సమయానికి పోలీసుల సైరన్ రావడంతో నిందితులు పరారయ్యారని ఫార్మసీ విద్యార్థులు వారిని తప్పుదోవ పట్టించిందని మూడో రోజులకు తేలడం తెలిసిందే.
Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, ఆల్‌టైమ్ గరిష్టానికి Silver Price
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook