Paytm iPhone 15 Offer: మీరు పేటీఎం వాడుతున్నారా, అయితే ఐఫోన్ 15 గెల్చుకోవచ్చు, ఎలాగంటే
Paytm iPhone 15 Offer: ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల యూపీఐ యాప్ పేటీఎం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే ఫెస్టివల్ థీమ్ పేరుతో ఏకంగా ఐఫోన్ 15 గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఇదే మంచి అవకాశం..
Paytm iPhone 15 Offer: ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ స్థూలంగా యూపీఐ యాప్స్ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే. మరింత భారీ సంఖ్యలో యూజర్లను ఆకట్టుకునేందుకు పేటీఎం కొత్త ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
పేటీఎం అనేది ఆన్‌లైన్ చెల్లింపులే కాకుండా ఆర్ధిక సేవలందించే సంస్థ. దేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న సంస్థ. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే థీమ్ పేరుతో యూజర్లు 500 రూపాయల క్యాష్‌బ్యాక్, ఐఫోన్ 15 గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం సూపర్ ఫాస్ట్, మరింత అనుకూలమైన చెల్లింపుల్ని ప్రారంభించినట్టు పేటీఎం తెలిపింది. ఈ ఆఫర్ ప్రకారం నిర్ణీత గడువు జనవరి 31 లోగా పేటీఎం యాప్‌లో కన్పించే 16 టికెట్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే సేకరించాలి.
పేటీఎం యాప్‌లో మొత్తం 16 లాక్డ్ స్టాంప్స్ కన్పిస్తాయి. ఇందులో ఆరెంజ్, వైట్, బ్లూ, గ్రీన్ రంగుల్లో స్టాంప్స్ కన్పిస్తాయి. వీటిలో నాలుగు వాట్సప్ ద్వారా స్నేహితుల్ని ఆహ్వానించి ఆ స్నేహితులు పేటీఎం వినియోగించేలా చేస్తే నాలుగు ఓపెన్ అవుతాయి. మిగిలినవి పేటీఎం ద్వారా సమీప దుకాణాల్లో చెల్లింపులు, రీఛార్జ్ చేయడం, బిల్లుల చెల్లింపులు, క్రెడిట్ కార్డు వినియోగం వంటివి చేయడం ద్వారా ఓపెన్ అవుతాయి. ఇలా మొత్తం 16 స్టాంప్స్ అన్‌లాక్ చేయగలిగితే 500 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్, ఐఫోన్ 15 గెల్చుకునే అవకాశం లభిస్తుంది.
పేటీఎం క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ సెక్షన్‌లో వెళ్లి అక్కడుంటే స్టాంప్స్ స్క్రాప్ చేయడం ద్వారా రిపబ్లిక్ డే స్టాంప్స్ పొందడం ద్వారా ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook