Petrol and diesel price today: చమురు ధరల పెరుగుదలను కొనసాగిస్తూ Oil companies శనివారం వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగింది. ఈ పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58 చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 80.97 కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధరలు రూ 100 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. గత 12 రోజుల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. పెట్రోల్ లీటర్‌కి రూ.3.64 పెరగగా, డీజిల్ ధర రూ. 4.18 పెరిగింది.


హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరలు (Petrol price in Hyderabad today) 40 పైసలు పెరిగిన అనంతరం రూ 94.18 చేరగా, లీటర్ డీజిల్ ధరలు 40 పైసలు పెరిగిన అనంతరం రూ.88.31 కి పెరిగింది.


Also read : Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో రికార్డు ధరలు


అలాగే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు (Petrol price in Vijayawada today) రూ 97.01 చేరగా, లీటర్ డీజిల్ ధరలు రూ.90.58 కి పెరిగింది.


విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధరలు (Petrol price in Visakhapatnam today) 26  పైసలు పెరిగిన తర్వాత రూ 96.02 కి చేరగా, లీటర్ డీజిల్ ధరలు 27 పైసలు పెరిగిన అనంతరం రూ.89.61 కి చేరింది.


కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.78 కి చేరగా డీజిల్ ధర 84.56 కి పెరిగింది. చెన్నైలో Petrol prices రూ. 92.59 కి పెరగగా, లీటర్ డీజిల్ ధర రూ.85.98 కి పెరిగింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


నొయిడాలో పెట్రోల్ ధరలు (Petrol price in Noida today) రూ.88.92 గా ఉండగా డీజిల్ ధరలు 81.41 గా ఉన్నాయి.