Petrol Diesel Price Today 18 April 2024: పెట్రోల్‌ డీజిల్‌ ధరలు కూడా బంగారం వెండి మాదిరి ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి సంబంధించి నేషనల్‌ క్రూడ్‌ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరగడం చూస్తూనే ఉన్నాం. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు గురువారం నాటికి ముడి చమురు ధరలు మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం పెట్రోల్ డీజిల్ ధరలపై ఎలా ఉందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగానే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు నిర్ణయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. బ్యారెల్ క్రూడ్‌ ఆయిల్ ధర 90 నుంచి 87 డాలర్లకు పడిపోయింది. అంటే ముడిచమురు ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అయినా కానీ, మన దేశంలో ప్రభుత్వ చమురు కంపెనీలు 18 గురువారం నాటికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఏ మార్పు చేయలేదు. ప్రాంతాలవారీగా మన దేశంలో పెట్రోల్‌ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


ఇదీ చదవండి: త్వరలోనే గూగుల్ నుంచి వాలెట్ యాప్.. phone pe, payment యూపీఐ యాప్స్ పనైపోయినట్లేనా?


ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 90.76 ఉంది. చెన్నైలో లీటర్ ధర పెట్రోల్ ధర రూ. 100.75 నమోదు చేయగా డీజిల్ లీటరుకు రూ.92.34 వద్ద ఉంది. మన దేశంలో ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు ప్రతిరోజూ ఈ ధరలను సమీక్షించి నవీకరిస్తాయి.


ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌.. బిర్యానీ ధరకే విమాన ప్రయాణం


హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఏప్రిల్ 18 గురువారం నాటికి రూ.107.41 వద్ద ఉండగా, లీటర్ డీజిల్‌ ధర రూ. 95.65 వద్ద ఉంది. ఈ ధరలు రెండురోజులుగా ఏ మార్పు లేదు. గత రెండు నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.109.66 నుంచి రూ. 107.41 మధ్య కొనసాగుతున్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook