Google Wallet: త్వరలోనే గూగుల్ నుంచి వాలెట్ యాప్.. phone pe, payment యూపీఐ యాప్స్ పనైపోయినట్లేనా?

Google Wallet: త్వరలోనే గూగుల్ భారతీయులకు మరో గుడ్ న్యూస్ తెలుపబోతుంది. యూపీఐ సేవలను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని సేవలు అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

 

Google Wallet: గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తమ వాలెట్ సేవలను భారతదేశంలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అయితే దీనికి సంబంధించిన సేవలు అతి త్వరలోనే గూగుల్ కంపెనీ ప్రారంభించబోతోంది. ఇప్పటికే గూగుల్ వాలెట్ భారతదేశంలోని ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచగా అతి త్వరలోనే సేవలను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది..

1 /7

అంతేకాకుండా గూగుల్ కంపెనీ ఈ వాలెట్‌(Google Wallet)తో పాటు మరోసారి అప్డేటెడ్ గూగుల్ పే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. టెక్ క్రంచ్ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం అతి త్వరలోనే గూగుల్ వాలెట్ కి సంబంధించిన గుడ్ న్యూస్ గూగుల్ తెలువబోతుందని పేర్కొన్నాడు.

2 /7

అంతేకాకుండా ఈ వాలెట్ భాగంగా ఫ్లైట్ టికెట్లతో పాటు సినిమా టికెట్లను బుక్ చేసుకునే ప్రత్యేకమైన ఆప్షన్స్ కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది అలాగే పెద్ద పెద్ద ఈవెంట్లకు సంబంధించిన బుకింగ్ ప్రక్రియను కూడా గూగుల్ వాలెట్ అందుబాటులో ఉంచబోతున్నట్లు సమాచారం.  

3 /7

దీంతోపాటు ఈవెంట్ టిక్కెట్‌లకు లాయల్టీ పాయింట్‌లను స్టోర్ చేసుకునే ఆకాశం కూడా గూగుల్ వాలెట్ (Google Wallet) యూజర్లకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ వ్యాలెట్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.

4 /7

ఇక గూగుల్ పే విషయానికొస్తే త్వరలోనే గూగుల్ దీని సేవలను నిలిపి వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో దీని సేవలను నిలిపివేయగా అతి త్వరలోనే భారత్లో కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  

5 /7

గూగుల్ ప్లే స్టోర్‌లో కేవలం కొన్ని దేశాల ప్రజలు మాత్రమే ఈ గూగుల్ వాలెట్‌పే డౌన్లోడ్ చేసుకునే విధంగా యాక్సిస్ అందించింది. అయితే ఈ యాప్ భారతదేశంలో విడుదల కాలేదు కాబట్టి భారతీయులకు గూగుల్ ప్లే స్టోర్‌లో వాలెట్ యాప్ కనబడకపోవచ్చు.

6 /7

అయితే ఇటీవల కొంతమంది తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్ వాలెట్ (Google Wallet) ప్రారంభమైనప్పటికీ కూడా గూగుల్ పే పనిచేస్తుందట. కంపెనీ మాత్రం ఇప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

7 /7

గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్‌లో అన్ని రకాల ట్రాన్జక్షన్స్ సులభంగా చేసుకునే అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ యాప్ మార్కెట్లోకి లాంచ్ అయితే ఫోన్ పే తో పాటు పేటీఎం ఇతర యూపీఐ పేమెంట్స్ యాప్స్ తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.