ఇంధన ధరల విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది. గత 8 నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్-డీజిల్ ధరలు రేపట్నించి అంటే డిసెంబర్ 5 నుంచి తగ్గనున్నాయి. పెట్రోల్-డీజిల్‌పై లీటర్ కు 5 రూపాయల వరకూ తగ్గవచ్చు. ఆ వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 శాతం తగ్గిన క్రూడ్ ఆయిల్


క్రూడ్ ఆయిల్ ధరల్లో వచ్చిన తగ్గుదల కారణంగా ఇంధన కంపెనీలు పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధర గత కొద్దికాలంగా బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే తక్కువే నమోదవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82 డాలర్లుంది. నవంబర్ నుంచి క్రూడ్ ఆయిల్ ధర 7 శాతం తగ్గుముఖం పట్టింది. 


డిసెంబర్ 5న పెట్రోల్ - డీజిల్ ధరల్లో భారీగా తగ్గుదల కన్పించవచ్చు. జీ బిజినెస్ అందిస్తున్న సమాచారం ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 96.72 రూపాయలు కాగా డీజిల్ ధర 89.62 రూపాయలుంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ 106.31 రూపాయలైతే, డీజిల్ ధర 94.27 రూపాయలుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 102.63 రూపాయలు కాగా, డిజిల్ ధర 94.24 రూపాయలుంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 106.03 రూపాయలు కాగా, డీజిల్ ధర 92.76 రూపాయలుంది. 


క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గుదల రావచ్చు. ఆయిల్ కంపెనీలకు ఎదురైన నష్టం ఇప్పటివరకూ తీరిపోయింది. మార్చ్ 2022 తరువాత నుంచి ఇప్పటి వరకూ ఆయిల్ ధరల్లో 27 శాతం తగ్గుదల నమోదైంది. 


Also read: Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్ స్కీమ్.. నెలకు రూ.5 వేలు పెట్టండి.. రూ.9.6 లక్షలు లాభం పొందండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook