Post Office Sumangal Plan: మీరు సురక్షితంగా డబ్బును డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాడు మంచి రాబడిని పొందుతారు. పోస్టాఫీసు తీసుకువచ్చిన సరికొత్త పథకంలో ప్రతినెల రూ.5 వేలు డిపాజిట్ చేయడం ద్వారా భారీ లాభం పొందవచ్చు.
ఈ పోస్టాఫీసు పథకం పేరు యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్. దీనిని సుమంగల్ ప్లాన్ అని కూడా అంటారు. ఈ పథకంలో పెట్టుబడి టర్మ్ పూర్తయిన తరువాత బోనస్‌తో కలిపి రూ.13.6 లక్షలు పొందవచ్చు. ఇందులో బోనస్ మొత్తం 9.6 లక్షలు.
పాలసీ ప్రత్యేకతలు
- ఇది పోస్టాఫీసు జీవిత బీమా పథకం.
- ఇందులో గరిష్ట హామీ మొత్తం రూ.50 లక్షలు.
- ఈ పథకం కింద ఎప్పటికప్పుడు రాబడిని పొందవచ్చు.
- మీ వయస్సు 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఉండాలి.
- నామినీ హామీ మొత్తం ప్రయోజనం పొందుతారు.
మీరు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సులో కూడా పాలసీని తీసుకోవచ్చు. మీరు ఈ పాలసీని 40 సంవత్సరాల వయస్సులో కొనుగోలు చేస్తే.. దాని కాల వ్యవధి 20 సంవత్సరాలు. మీరు 45 సంవత్సరాల వయస్సులో కొనుగోలు చేస్తే.. పాలసీ కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంటుంది.
ఇండియా పోస్ట్ కాలిక్యులేటర్ ప్రకారం.. మీరు 20 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని తీసుకుని 10 లక్షల హామీ మొత్తాన్ని కలిగి ఉంటే.. దాని నెలవారీ ప్రీమియం రూ.5 వేలు అవుతుంది. ట్యాక్స్‌తో కలిపి రూ.5,173 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు 8వ, 12వ, 16వ సంవత్సరాలలో రూ.2-2-2 లక్షల డబ్బును తిరిగి పొందుతారు. 20 సంవత్సరాల తర్వాత మీ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు మీకు రూ.4 లక్షల బోనస్ లభిస్తుంది.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిలకు షాకిచ్చిన పోలీసులు.. పాదయాత్రకు బ్రేక్
Also Read: India Vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్.. తుది జట్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook