Petrol Price in India: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో ధరలు పెరగట ఇది ఎనిమిదవసారి. బుధవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో దాదాపు రూపాయి చొప్పున పెరిగాయి. దీనితో గత 8 రోజుల్లో పెట్రోల్ ధర రూ.5.60 చొప్పున పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల వల్లే.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.


ప్రస్తుత ధరలు ఎంతంటే..?


దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్​ ధర లీటర్​ 80 పైసలు పెరిగింది. దీనితో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.101.05 వద్ద ఉంది. ఇక రూ.92.31 వద్దకు చేరింది.


హైదారాబాద్​, వైజాగ్​లో రేట్లు..


హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​ 91 పైసలు పెరిగి రూ.114.5 వద్దకు ఉంది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి.. రూ.100.69 వద్ద కొనసాగుతోంది.


వైజాగ్​లో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా 88 పైసలు, 83 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్ ధర రూ.115.16 వద్ద, డీజిల్ ధర లీటర్​ రూ.101.02వద్ద ఉన్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు..


  • చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ రూ.106.68 వద్ద (76 పైసలు పెరిగింది) ఉంది. లీటర్ డీజిల్ ధర 76 పైసలు పెరిగి 96.74 వద్ద కొనసాగుతోంది.

  • బెంగళూరులో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి లీటర్​ రూ.106.44 వద్ద విక్రయమవుతోంది. లీటర్ డీజిల్ ధర 79 పైసలు పెరిగి రూ.90.47 వద్దకు చేరింది

  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.115.86 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 85 రూ.100.08 వద్ద కొనసాగుతోంది.

  • కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 84 పైసలు, 80 పైసల చొప్పున పెరిగింది. దీనితో లీటర్ పెట్రోల్​ రూ.110.50 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.95.4 వద్ద ఉన్నాయి.


Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గుతున్న బంగారం ధరలు


Also read: Fedex CEO: మరో దిగ్గజ సంస్థకు భారతీయుడి నాయకత్వం- ఫెడ్​ఎక్స్​ సీఈఓగా రాజ్​ సుబ్రమణియం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook