How to Withdraw PF Amount: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఎలా విత్ డ్రా చేసుకోవాలి..? ఎంత విత్ డ్రా చేసుకోవాలో తెలియడం లేదా..? ఉద్యోగుల తమ పీఎఫ్‌ ఖాతా నుంచి అత్యవసర అవసరాల కోసం అమౌంట్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు. వివిధ అవసరాల కోసం పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు లిమిట్ ఉంటుంది. రిటైర్‌మెంట్ తరువాత ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం హ్యాపీగా సాగిపోయేందుకు పీఎఫ్‌ను కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎఫ్‌లో జమ అయిన డబ్బుకు ప్రభుత్వం వార్షిక వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్‌లో వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. పీఎఫ్‌ అకౌంట్‌ను అత్యవసర సమయాల్లో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రతి అవసరానికీ నిధులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Petrol Price: వావ్ ఇట్స్ వేరీ చీప్.. అక్కడ పెట్రోల్ ధరలు అత్యంత చవక.. లీటర్ ఎంతంటే..?


పీఎఫ్‌ నుంచి ఎప్పుడు, ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..?


==> ఉద్యోగులు ఏకకాలంలో పీఎఫ్‌ నుంచి డబ్బులను పూర్తిగా లేదా పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. 
==> ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు డబ్బులు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
==> ఉద్యోగి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే.. పీఎఫ్‌ మొత్తంలో 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మరో రెండు నెలలు ఉద్యోగం లేకుండా ఉంటే.. మిగిలిన 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.


ఏ అవసరాలకు పీఎఫ్‌ డబ్బులు తీసుకోవచ్చు..?


చికిత్స: మెడికల్ ఎమర్జెన్సీ కోసం పీఎఫ్‌ నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే.. మీ బేసిక్ పేకు ఆరు రేట్లు లేదా ఉద్యోగి వాటాలో డిపాజిట్ చేసిన మొత్తం, వడ్డీ కలిపి విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి తనకు, పిల్లలు, భార్య, తల్లిదండ్రుల చికిత్స కోసం విత్ డ్రా చేసుకోవచ్చు.


పెళ్లి: వివాహం కోసం పీఎఫ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే.. ఏడేళ్ల సర్వీస్ పూర్తి అయి ఉండాలి. ఉద్యోగి తనకు, తన కొడుకు లేదా కుమార్తె, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం డబ్బు తీసుకోవచ్చు. తన వాటాలో 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.


ఎడ్యూకేషన్: ఉద్యోగి తన పిల్లల చదువు కోసం పీఎఫ్‌లో ఉద్యోగి వాటాలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే 7 సంవత్సరాల సర్వీస్‌ను కచ్చితంగా కలిగి ఉండాలి..


ల్యాండ్ కొనుగోలుకు లేదా ఇంటి కోసం అయితే ఐదేళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. భూమి కొనుగోలు చేయడానికి ఉద్యోగి బేసిక్ పే, డీఏపై 24 రెట్ల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడానికి ఉద్యోగి బేసిక్ పే, డీఏకు 36 రెట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు లేదా భూమి ఉద్యోగి పేరు మీద లేదా భార్యాభర్తల ఉమ్మడి పేరు మీద ఉండాలి. భూమి లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి ఒక్కసారి మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు తీసుకున్న తర్వాత 6 నెలల్లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించి 12 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి.


హోమ్ లోన్ రీపేమెంట్: హోమ్ లోన్‌ను చెల్లించడానికి పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే పదేళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగులు తమ బేసిక్ పే, డీఏకు 36 రెట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతోపాటు పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ఉద్యోగి హోమ్ లోన్ మొత్తం బకాయి ఉన్న అసలు, వడ్డీకి సమానమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ హోమ్ లోన్ ఉద్యోగి లేదా భార్యాభర్తల పేరిట ఉండాలి. ఉద్యోగి ఖాతాలో మొత్తం రూ.20 వేలకు మించి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగి హోమ్ లోన్ సంబంధిత పత్రాలను ఈపీఎఫ్‌ఓకి సమర్పించాలి.


గృహ పునరుద్ధరణ: గృహ పునరుద్ధరణ కోసం ఉద్యోగులు కూడా పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. బేసిక్ పే, డీఏ‌కు 12 రెట్లు ఉపసంహరించుకోవచ్చు. దీంతో పాటు పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం ఖర్చు లేదా ఉద్యోగి వాటా, వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఆస్తి ఉద్యోగి పేరు మీద లేదా భార్యాభర్తల పేర్ల మీద ఉండాలి. అంతేకాకుండా ఇల్లు నిర్మించి ఐదేళ్లు అయి ఉండాలి. 


పదవీ విరమణకు ముందు: ఉద్యోగి వయస్సు 58 సంవత్సరాలు నిండి ఉంటే.. రిటైర్‌మెంట్‌కు ఒక సంవత్సరం ముందు పీఎఫ్‌ జమ చేసిన మొత్తంలో 90 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.


Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter