Petrol Price: వావ్ ఇట్స్ వేరీ చీప్.. అక్కడ పెట్రోల్ ధరలు అత్యంత చవక.. లీటర్ ధర ఎంతంటే..?

Cheapest Petrol Price In India: కొన్నిరోజులుగా పెట్రోల్‌, డీజీల్  ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమైతే తప్ప బండి బైటకు తీయాలంటేనే ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు  రెండురూపాయలను తగ్గిస్తు కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

1 /5

దేశంలో పెట్రోల్, డీజీల్ రేట్లు మండిపోతున్నాయి. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీలు, సెస్ లు, అనేక పన్నుల మూలంగా మనదేశానికి వచ్చేవరకు పెట్రోల్ ధరలు తడిసిపోతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయంగా దేశాల మధ్య యుద్ధాలు ఉండటం వల్ల పెట్రోల్ ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకొవచ్చు.   

2 /5

ఇక అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా పెట్రోల్ ధరలలో వ్యత్యాసం కన్పిస్తు ఉంటుంది. దీంతో కొన్ని చోట్ల పెట్రోల్, డీజీల్ ల ధరలు భారీగాను మరికొన్ని చోట్ల తక్కువగాను ఉంటాయి.   

3 /5

ఈక్రమంలోనే తాజాగా ఎన్నికల నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కడ ఎంతుందో తెలుసుకొవడానిక  అందరు ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్, డీజీల్ ధరలు రూ.109.87 గాను, డీజీల్ ధరలు రూ. 97.6  గాను ఉంది.   

4 /5

ఇక.. తెలంగాణలో.. పెట్రోల్ ధరలు,  రూ. 107.39 , డీజీల్ ధరలు.. రూ. 95.63 గాను ఉంది. డామన్ లో పెట్రోల్ ధరలు రూ. 82 గాను, ఐజ్వాల్ లో  రూ. 93. 68 గా, ఢిల్లీలో రూ.94 గా పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఇక డీజీల్ ధరల విషయానికి వస్తే..   కేరళలో రూ. 96.41 గాను ఉంది.

5 /5

దేశంలో అత్యల్పంగా అండమాన్ , నికోబార్ లో  పెట్రోల్ ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. అండమాన్ లో పెట్రోల్ ధరలు.. రూ. 82 గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్, డీజీల్ ధరలు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎన్నికలలో పెట్రోల్ ధరల తగ్గింపుకై చర్యలు తీసుకుంటామని నేతలు హమీని ఇస్తున్నారు.