PhonePe processing fees: ఫోన్‌పే షాకింగ్ నిర్ణయం- ఇక నుంచి మొబైల్ బిల్లులపై ఛార్జీల వసూలు!
PhonePe Charges: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సేవల అప్లికేషన్ ఫోన్‌పే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ యాప్ ద్వారా చెల్లించే మొబైల్ బిల్లులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
PhonePe processing fees: వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫోన్‌పే యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ రీఛార్జ్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (PhonePe Charges on Mobile recharge) చేస్తోంది. వాలెట్‌తో పాటు.. యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసిన ఛార్జీలు వర్తిస్తాయని తెలిసింది. యూపీఐ ఆధారంగా పని చేసే యాప్‌లలో.. ఛార్జీల వసూలు ప్రారంభించిన మొదటి అప్లికేషన్ ఫోన్‌పేనే కావడం గమనార్హం.
ఛార్జీలు ఎంత?
రూ.50 నుంచి రూ.100 వరకు రీఛార్జ్ చేస్తే ఒక రూపాయిని ఛార్జీగా వసూలు చేస్తుంది (PhonePe Charges) ఫోన్‌పే. రీఛార్జ్ విలువ రూ.100 దాటితే.. రూ.2లను ఛార్జ్ చేయనుంది.
రు.50 కన్నా తక్కువ మొబైల్ బిల్లులకు ఎలాంటి ఛార్జీలు ఉండనవి స్పష్టం చేసింది ఫోన్‌పే.
ఫోన్‌పేకు ఆదాయం ఎలా వస్తుంది?
ఫోన్ పే సహా ఇతర ఇతర డిజిటల్ పేమెంట్ యాప్స్ (PhonePe income source) యూజర్లకు ఉచితంగానే సేవలందిస్తుంటాయి. కరెంట్ బిల్లులు, రీఛార్జ్‌లు, విమాన టికెట్ బుకింగ్స్ సహా వివిధ సేవలు వీటిలో ఉంచితంగానే పొందొచ్చు. అయితే ఈ సేవలందించడం ద్వారా నేరుగా యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోవు. కానీ.. మొబైల్ రీఛార్జ్ విషయంలో అయితే టెలికాం కంపెనీల నుంచి ఇతర పేమెంట్స్ విషయంలో ఆయా సంస్థల నుంచి కమీషన్ల రూపంలో ఆదాయాన్ని గడిస్తుంటాయి.
క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలకు.. ట్రాన్సక్షన్ విలువను బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంటాయి ఆయా యాప్‌లు.
దీనితో పాటు.. ఆయా యాప్‌లను వినియోగించే యూజర్ల ఆర్థిక విధానాలు, కొనుగోలు సామర్థ్యం వంటి డేటా స్టోర్ అవుతుంది. ఈ డేటాను లక్ష్యిత వాణిజ్య ప్రకటనలకోసం విక్రయిస్తుంటాయి. దీని ద్వారా కూడా ఆయా యాప్‌లను నిర్వహించే కంపెనీలకు ఆదాయం సమకూరుతుంటుంది. ఇప్పటి వరకు వాటికి ఇవే ప్రధాన ఆదాయ మార్గాలు. ఇప్పుడు తొలిసారి ఫోన్‌పే యూజర్ల నుంచి ఛార్జీలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు!
డిజిటల్ పేమెంట్ మార్కెట్ ఇలా..
ప్రస్తుతం యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సేవలందించే (Digital payment Market in India) విభాగంలో.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ సంస్థలన్ని ఆఫర్లు, స్క్రాచ్ కార్డ్‌ల వంటి ప్రమోషన్లతో యూజర్లను ఆకర్షిస్తుంటాయి.
డిజిటల్ పేమెంట్ మార్కెట్ విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరిలో గూగుల్ పేను దాటి ఫోన్ పే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ పరంగానూ ఫోన్ పే తొలి స్థానంలో నిలిచింది. కరోనా తర్వాత ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్వైపు మొగ్గు చూపడం కూడా ఈ యాప్‌లకు కలిసొచ్చింది.
అయితే ఇప్పుడు ఫోన్‌పే ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో యూజర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also read: Petrol Price Hiked: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరల మోత- చెన్నైలో సెంచరీ కొట్టిన డీజిల్
Also read: House Of Khaddar: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఖద్దర్‌ను లాంచ్ చేయనున్న కమల్ హాసన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook