Swiggy leave offer: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు (డెలివరీ పార్ట్నర్స్కు) సెలవుల విషయంలో వినూత్న వెసులుబాటు కల్పించేందుకు సిద్ధమైంది.
మహిళలకు ఉండే శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. నెలలో రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు తీసుకునేలా వెసులుబాటు ఇవనుంది. అయితే ఈ లీవ్స్ గురించి ఎలాంటి కారణం చెప్పాల్సిన పని లేదని స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
మిహిర్ షా బ్లాగ్‌లో ఏముందంటే..
'మహిళలు నెలసరి సమయంలో బయటకు రావాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాన్ని బయట చెప్పాలన్నా వాళ్లకు ఇబ్బందే. డెలివరీ పార్ట్నర్గా మహిళలు చేరకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నాం. అందుకే అలాంటి మహిళలకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని మిహిర్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
స్విగ్గీ 2016 నుంచి మహిళలను కూడా డెలివరీ పార్ట్‌నర్స్‌గా చేర్చుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా స్విగ్గీలో ప్రస్తుతం 1000కి పైగా విమెన్ డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. అందులో 99 శాతం మంది 45 ఏళ్ల లోపు వయసు వారే. వారిలో 89 శాతం మందికి కనీసం ఒక సంతానం ఉన్నట్లు తెలిసింది. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంతో డెలివరీ మహిళా ఉద్యోగులకు ఊరట లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: Health benefits of Sesame oil: నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
అయితే లీవ్స్‌తో పాటు మహిళా ఉద్యోగుల పని సమయాల్లోనూ మార్పులు చేసింది స్విగ్గీ. విమెన్ డెలివరీ పార్ట్నర్స్ డ్యూటీ సాయంత్రం 6 వరకే పరిమితం చేసింది. నిజానికి సాయంత్రం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మహిళాల భద్రత కోసం స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది.
Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు!
Also read: Petrol Price Hiked: దేశంలో ఆగని పెట్రో మోత- వరుసగా మూడో రోజు ధరల పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook