PIB Fact Check News: సోషల్ మీడియా బాగా వినియోగంలోకి వచ్చిన తరువాత ఫేక్ వార్తల ప్రచారం ఎక్కువై అయిపోయింది. నిజం గడపదాటేలోపు.. అబద్దం ఊరంతా తిరిగివస్తుంది అన్న చందంగా.. ప్రస్తుతం తప్పుడు ప్రచారం క్షణాల్లో ప్రపంచం అంతా తిరిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నెలకు 5100 రూపాయలు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా చాలా మంది తమ సన్నిహితులు, తెలిసినవాళ్లకు షేర్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా ఫాక్ట్ చెక్ చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రామిక్ సమ్మాన్ యోజన కింద ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా 5100 రూపాయలు ఇస్తోందని ఆ మెసేజ్‌లో ఉంది. 'NITI GYAN 4 U' అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ఈ ప్రచారాన్ని ప్రసారం చేసినట్లు పీఐబీ నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం "శ్రామిక్ సమ్మాన్ యోజన" కింద మహిళలకు నెలకు  రూ.5100 ఇస్తున్నట్లు ఈ ఛానెల్ తప్పుడు ప్రచారం చేస్తోందని పీఐబీ ట్వీట్ చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ప్రజలు నమ్మవద్దని సూచించింది. 


ప్రజలను తప్పు దోవ పట్టించే మెసేజ్‌లు షేర్ చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకం గురించి సమాచారం తెలుసుకోవడానికి.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోవాలని సూచించింది. ఆ ఛానెల్ ప్రచారం చేస్తున్న మెసేజ్‌ ఫేక్ అని.. "శ్రామిక్ సమ్మాన్" అనే ఏ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


 




Also Read: India Vs Australia: ఓవల్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన ఇలా.. ఎవరు కీలకం అంటే..?  


ఇలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇలాంటి ఫేక్ వార్తలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది.  తప్పుడు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఆదేశించింది. అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండని తెలిపింది. మీరు ఏదైనా వైరల్ మెసేజ్ నిజమో కాదో తెలుసుకోవాలంటే.. 918799711259 నంబరు లేదా socialmedia@pib.gov.in కు మెయిల్‌లో సంప్రదించవచ్చు.


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook