PNB rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) ఖాతాదారులకు బ్యాడ్​ న్యూస్​. సేవింగ్స్ ఖాతe డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ పీఎన్​బీ తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచే వర్తిస్తాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త వడ్డీ రేట్లు ఇలా..


సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షల కన్నా తక్కువ మొత్తంలో నిధులు ఉంటే 2.75 శాతం వార్షిక వడ్డీ చెల్లించనుంది పీఎన్​బీ. ఇంతకు ముందు ఇది 2.80 శాతంగా ఉండేది.


రూ.10 లక్షల కన్నా ఎక్కువ సేవింగ్స్ బ్యాలెన్స్​పై 2.80 శాతం వార్షిక వడ్డీని ఇవ్వనున్నట్లు తెలిపింది పీఎన్​బీ. ఇప్పటి రూ.10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్​ ఉంటే.. 2.85 శాతం వార్షిక వడ్డీ లభించేది. రూ.500 కోట్ల వరకు ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది.


రూ.500 కోట్ల డిపాజిట్​ మించితే 3.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుందని పీఎన్​బీ వెల్లడించింది.


క్యూ3లో పీఎన్​బీ జోరు..


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (అక్టోబర్​-డిసెంబర్​) కాలంలో పీఎన్​బీ రూ.1,126.78 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పీఎన్​బీ నికర లాభం రూ.506 కోట్లుగా ఉంది. ఇక చివరి త్రైమాసికంలో మొండి బకాయిలు కూడా స్వల్పంగా తగ్గాయని బ్యాంక్ ఇటీవల ప్రకటించింది.


గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య పీఎన్​బీ రూ.22,026 కోట్ల ఆదాయాన్ని గడిచింది. అంతకు ముందు సంవత్సరం ఈ మొత్తం రూ.23,298.53 కోట్లుగా ఉండటం గమనార్హం.


Also read: RBI Interest Rates: ఆర్బీఐ చివరి త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం


Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook