Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివీ

Todays Gold Rate: బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పించినా..నిన్నటి నుంచి స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2022, 06:31 AM IST
Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివీ

Todays Gold Rate: బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పించినా..నిన్నటి నుంచి స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం ధరల పెరుగుదల లేదా తగ్గుదలపై చాలా రకాల కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి వంటి వ్యాధుల సంక్రమణ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పు కన్పిస్తుంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల 2 వందలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 420 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 550 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ఉంది. హైదరాబాద్‌లో ( Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది.

Also read: SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- గడువులోపు అ పనిని పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న సేవలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News