Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీసు పథకం, 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు
Post Office Scheme: పోస్ట్ ఆఫీసు పథకాలు అద్భుతమైన లాభాల్ని ఇస్తుంటాయి. పోస్టాఫీసు పధకాలు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారులు కావచ్చు.
కస్టమర్ల కోసం పోస్టీఫీసు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఇందులో ఓ పథకం ద్వారా 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ పధకం వివరాలు తెలుసుకుందాం..
పోస్టాఫీసు పథకాలు ఎప్పటికీ సురక్షితమే కాకుండా అద్భుతమైన రిటర్న్స్ కూడా ఉంటాయి. మీరు కూడా సురక్షిత విధానంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారి కావచ్చు. పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎక్కౌంట్
మీరు రిటైర్ అయుంటే..మీ కోసం పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో ప్రయోజనాలు చాలా ఎక్కువ. జీవితమంతా సంపాదించిన డబ్బు పోస్టాఫీసులో పెట్డుబడి పెడితే చాలా సురక్షితమే కాకుండా..అధిక లాభాల్ని ఇస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కోసం వయస్సు 60 ఏళ్లు ఉండాలి. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సువారికే ఈ స్కీమ్‌కు అర్హత ఉంటుంది. ఇది కాకుండా వీఆర్ఎస్ తీసుకున్నవాళ్లు కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
5 ఏళ్లలో 14 లక్షలు ఎలా
ఒకవేళ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మీరు ఒకేసారి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే..ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన 5 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ పూర్తయ్యాక..మొత్తం 14, 28, 964 రూపాయలు లభిస్తాయి. అంటే కేవలం వడ్డీ డబ్బులే 4,28,964 రూపాయలు వస్తాయి.
1000 రూపాయలకే ఎక్కౌంట్ ఓపెన్ చేసే అవకాశం
ఈ స్కీమ్‌లో ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు కావల్సిన కనీస మొత్తం 1000 రూపాయలు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకే పొదుపు చేయగలరు. ఖాతా తెరిచేందుకు లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే మాత్రం క్యాష్ రూపంలో ఇవ్వవచ్చు. లక్ష రూపాయలకు పైబడి ఉంటే మాత్రం కచ్చితంగా చెక్ ఇవ్వాల్సిందే.
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. ఒకవేళ ఇన్వెస్టర్ కోరుకుంటే..ఈ టైమ్ పెంచుకోవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌పై ఇచ్చిన వివరాల ప్రకారం..మెచ్యూరిటీ తరువాత ఈ స్కీమ్‌ను మరో మూడేళ్లకు పెంచవచ్చు. దీనికోసం పోస్టాఫీసుకు వెళ్లి..దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది.
ట్యాక్స్ మినహాయింపు
ఇక సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో మీ వడ్డీ ఏడాదికి 10 వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ కట్ అవుతుంది. అయితే ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
Also read: LIC Pension Policy: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితమంతా పెన్షన్ గ్యారంటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook