Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు
Post Office MIS: మీ పెట్టుబడి భద్రంగా ఉండాలి. నెలనెలా ఆదాయం రావాలి అని అనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ బెస్ట్ స్కీం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీం (MIS) మీకు మంచి ఆప్షన్. ఈ పథకం ద్వారా మీ పూర్తి పెట్టుబడుల మొత్తం భద్రతతోపాటు ప్రతినెలా మీకు స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుంది.
Post Office MIS: మీ పెట్టుబడి భద్రంగా ఉండాలి. నెలనెలా ఆదాయం రావాలి అని అనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ బెస్ట్ స్కీం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీం (MIS) మీకు మంచి ఆప్షన్. ఈ పథకం ద్వారా మీ పూర్తి పెట్టుబడుల మొత్తం భద్రతతోపాటు ప్రతినెలా మీకు స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుంది. దీనికి మీరు చేయవల్సింది కేవలం పోస్ట్ ఆఫీసులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వాటి నియమాలు ఏముంటాయో తెలుసుకుందాం.
జాయింట్ అకౌంట్ వల్ల లాభాలు..
పోస్ట్ ఆఫీస్ MIS ఖాతాను సింగిల్ లేదా మీ భాగస్వామి, సోదరుడు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరితోనైనా కలిసి ఈ ఓపెన్ చేయాలి. దీనివల్ల డిపాజట్ లిమిట్ పెరగడమే కాకుండా మీకు గరిష్ట లాభాలు కూడా పొందవచ్చు.
నెలవారీ గ్యారంటీ ఆదాయం..
1. పోస్ట్ ఆఫీస్ MIS డిపాజిట్ స్కీం మీ అసలు మొత్తానికి నెలనెలా వడ్డీ డబ్బులను ఇస్తుంది. ఇది నేరుగా మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లోకి ప్రతినెలా జమా అవుతుంది. దీంతో మీ డబ్బు భద్రంగా ఉంటుంది, స్థిరమైన ఆదాయాన్ని అందుతుంది. 5 ఏళ్ల తర్వాత మీరు మీ డబ్బులను పూర్తిగా తిరిగి తీసుకోవచ్చు. కావాలంటే మళ్లీ మరో కొత్త ఖాతాను కూడా మీరు ప్రారంభించవచ్చు.
రూ. 5,55,000 జాయింట్ అకౌంట్ ద్వారా ఎలా అదనంగా సంపాదింలి?
1. పోస్ట్ ఆఫీసు ఈ స్కీం పై ప్రస్తుతం 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ ద్వారా 15 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ప్రతినెలా రూ.9,250 వడ్డీ లభిస్తుంది.
2. ఇది సంవత్సరానికి రూ.1,11,000. ఐదేళ్లకు వడ్డీ మొత్తం రూ.5,55,000 అవుతుంది.
3. ఒకవేళ మీరు సింగిల్ గా రూ. 9 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ.5,550 వడ్డీ రూపంలో వస్తుంది. ఇది ఐదేళ్లకు రూ.3,33,000 అవుతుంది.
ఈ పథకానికి అర్హులు ఎవరు?
ఈ పోస్ట్ ఆఫీస్ MIS ఏ దేశంలో ఉన్నవారైనా అర్హులు. పిల్లల పేరుపై కూడా ఈ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. మీ పిల్లల వయస్సు ఒకవేళ 10 ఏళ్లకు తక్కువగా ఉంటే లీగల్ గైడ్ లైన్స్ ద్వారా పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతోపాటు ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఉండాలి.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..
ఇదీ చదవండి: Zero Income Tax Countries: ఇక్కడ కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు.. ఒక్కపైసా కూడా పన్ను కట్టక్కర్లేదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook