Post Office Senior Citizen Scheme: ​ఇప్పుడు మేం మీకు చెప్పబోయే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ద్వారా రిటైర్ అయిన తరువాత కూడా క్రమం తప్పకుండా ప్రతినెలా కచ్చితమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20,500 రూపాయలు ఐదేళ్ల వరకూ పొందవచ్చు. మీ రిటైర్మెంట్ డబ్బుల్ని ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాదికి కేవలం వడ్డీనే 2 లక్షల 46 వేలు అందుకోవచ్చు. ప్రభుత్వ గ్యారంటీతో పోస్టాఫీసుల్లో లభ్యమయ్యే ఈ పధకమే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. 


పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కనీసం 1000 రూపాయల్నించి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో గరిష్టంగా 30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ మనీని ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా నిర్ధిష్టమొత్తం డబ్బులు ఆదాయంగా పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం మినహాయింపు ఉంటుంది. అయితే దీనిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. 


60 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. అంటే రిటైర్మెంట్ డబ్బులు వృధా కాకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతినెలా డబ్బులు పొందవచ్చు. వీఆర్ఎస్ తీసుకున్నవారికి కూడా ఈ పధకం వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు 5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా వడ్డీ 10,250 రూపాయలు వస్తుంది. అంటే ఐదేళ్లకు కేవలం వడ్డీనే 2 లక్షల రూపాయలు తీసుకోవచ్చు.. 


సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పధకం. అందుకే మీ డబ్బులకు గ్యారంటీ ఉంటుంది. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. వడ్డీ ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తుంటారు. 


Also read: Railway Recruitment 2024: రైల్వేలో మెగా రిక్రూట్‌మెంట్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter