Post Office Scheme: కేవలం రూ.417 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.1 కోటి సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..
Post Office Scheme: పోస్టాఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్‌తో మిలియనీర్ అవొచ్చు. ఇందుకోసం మీరు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు.
Post Office Scheme: ప్రతీ వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థికపరమైన అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈ రెండూ ఉంటేనే జీవితంలో మనీ కష్టాలనేవి దరిచేరవు. ఆర్థికపరమైన ప్రణాళికలు సరిగా ఉంటే మంచి జీవితాన్ని లీడ్ చేయవచ్చు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ.. దాన్ని సరైన రీతిలో ఇన్వెస్ట్ చేయలేకపోతారు. ప్రైవేట్ సెక్టార్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమంటే కొంత రిస్క్ ఉండొచ్చు కానీ పోస్టాఫీస్ లాంటి స్కీమ్స్‌లో మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. పోస్టాఫీస్ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో తక్కువ పెట్టుబడితో రూ.1 కోటి సంపాదించడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న మొత్తంతో రూ.1 కోటి సంపాదించే ప్లాన్:
పోస్టాఫీస్ అందిస్తున్న పీపీఎఫ్ స్కీమ్‌తో మిలియనీర్ అవొచ్చు. ఇందుకోసం మీరు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇలా 15 సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఎటువంటి పన్ను విధించబడదు. ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటుతో పాటు కాంపౌండ్ వడ్డీ రేటు పొందుతారు.
15 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.22.50 లక్షలు అవుతుంది. దీనికి ఏడాదికి 7.1 శాతం వడ్డీ చొప్పున, అలాగే కాంపౌండ్ వడ్డీ రేటు కూడా కలుపుకుంటే.. లోన్ మెచ్యూరిటీ సమయానికి రూ.18.18 లక్షలు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే.. మీ మొత్తం డబ్బు రూ.40.68 లక్షలు అవుతుంది.
15 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేసి మరో 10 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పెట్టే పెట్టుబడి మొత్తం 37.50 లక్షలు కాగా.. వడ్డీతో కలిపితే రూ.65.58 లక్షలు జమవుతాయి.అంటే మొత్తంగా మీ పెట్టుబడి విలువ 25 ఏళ్లలో రూ.1.03 కోట్లకు చేరుతుంది.
ఎవరు అర్హులు :
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందేవారు, ఫించన్ దారులు ఈ స్కీమ్‌కు అర్హులు. మైనర్ పిల్లల తరుపున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. ఇందులో జాయింట్ అకౌంట్‌కు అవకాశం లేదు. ఎన్ఆర్ఐలు ఈ స్కీమ్‌కు అనర్హులు.
Also Read: Maharashtra Suicide: మహారాష్ట్రలో పెను విషాదం.. ఒకే ఇంట్లో 9 మృతదేహాలు!
Also Read: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook