NSC Benefits: ఈ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే 7.7 శాతం వడ్డీతో పాటు ట్యాక్స్ మినహాయింపు కూడా
NSC Benefits: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు అధిక ప్రాచుర్యం, ఆదరణ లభిస్తోంది. అధిక వడ్డీతో పాటు సర్వీస్ బాగుండటం ఇందుకు కారణం. అంతేకాకుండా ఈ పథకాలతో 77.7 శాతం వడ్డీ పొందడంతో పాటు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
NSC Benefits: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పధకం అనేది సాధారణంగా ప్రతి పోస్టాఫీసులో లభ్యమౌతుంది. దీనినే స్థూలంగా ఎన్ఎస్‌సి పధకంగా పిలుస్తారు. అధిక వడ్డీతో పాటు ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై రిటర్న్స్ అధికంగా ఉండటమే కాదు..ఇది నూటికి నూరు శాతం రిస్క్ లేనిది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పధకం కావడంతో మీ పెట్టుబడికి ఫుల్ గ్యారంటీ ఉంటుంది. మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తుంటే పోస్టాఫీసు సేవింగ్ పధకాలు సరైన ప్రత్యామ్నాయాలు. ఈ పధకాలను కేంద్ర ప్రభుత్వమే నడుపుతుంటుంది. అలాంటిదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఈ పధకంలో ఆకర్షణీయమైన 7 శాతం వడ్డీ లభిస్తుంది. రిటర్న్ బెనిఫిట్స్ కారణంగా పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ చాలా ఆదరణ పొందిన పధకం. అందుకే ఈ పధకంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్ఎస్‌సి ఎక్కౌంట్ లబ్దిదారులకు 7.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పధకం కాలవ్యవధి ఐదేళ్లు. అంటే ఐదేళ్ల తరువాతే మీ డబ్బులు తీసుకోగలరు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పధకంపై లభించే సాదారణంగా బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ పధకాల కంటే ఎక్కువే ఉంటుంది. బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలపై వడ్డీ 7 నుంచి 7.5 శాతం ఉంటుంది. ప్రతి మూడునెలలకోసారి వడ్డీ రేట్లపై సమీక్ష ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ పధకంపై ప్రభుత్వం అందించే మొత్తం వడ్డీ అందాలంటే ఐదేళ్లు పూర్తిగా కొనసాగించాలి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. పూర్తిగా ఐదేళ్లు ఉంచకపోతే వడ్డీ ఏమాత్రం దక్కదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పధకంపై ఇప్పుడు 7.7 శాతం వడ్డీ లభిస్తోంది. అంతేకాకుండా ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎక్కౌంట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. పదేళ్లలోపు పిల్లల పేరుపై ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రులే ఎక్కౌంట్ నిర్వహించాల్సి ఉంటుంది. పదేళ్లు నిండితే మాత్రం పిల్లలే సొంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ పధకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు.
Also read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన ఎక్కౌంట్ ఎలా చెక్ చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook