Post Office Schemes: పోస్టాఫీసుల్లో చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల ద్వారా కస్టమర్లు లక్షలాది రూపాయలు ప్రయోజనం పొందనున్నారు. అలాంటి పధకమే ఇది. ఏ మాత్రం రిస్క్ లేకుండా నామమాత్రపు పెట్టుబడిలో మెచ్యూరిటీ అనంతరం లక్షల రూపాయలు సంపాదించుకునే అద్భుత అవకాశం. పోస్టాఫీసు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు రెండూ ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి ప్రత్యామ్నాయాలు. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు అందిస్తున్న ఈ అద్భుతమైన పధకం పేరు గ్రామ సురక్ష పధకం, ఇందులో ప్రభుత్వం తరపు నుంచి ఏకంగా 35 లక్షల రూపాయలు అందుతాయి. ఇండియన్ పోస్టాఫీసు ఈ పధకాన్ని ప్రారంబించింది. ఈ పధకంలో రిస్క్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ. ప్రతి నెలా 1500 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 


పోస్టాఫీసు పథకంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్౨మెంట్ చేస్తుంటే భవిష్యత్తులో 31-35 లక్షల వరకూ ప్రయోజనం చేకూరనుంది. 19 ఏళ్ల వయస్సులో ఈ పధకం ప్రారంభించి 10 లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే 55 ఏళ్ల వరకూ నెలసరి ప్రీమియం 1515 రూపాయలుంటుంది. 58 ఏళ్లకైతే 1463 రూపాయలు, 60 ఏళ్లకైతే 1411 రూపాయిలు ఉంటుంది. అంటే పాలసీదారుడు 55 ఏళ్లకు 31.60 లక్షలు, 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్లకు 34.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ అనంతరం లభిస్తాయి.


19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన భారతీయుడెవరైనా ఈ పోస్టాఫీసు గ్రామ సురక్ష స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పధకంలో కనీస మొత్తం 10 వేల నుంచి 10 లక్షల వరకూ ఉంటుంది. ఈ పథకం ప్రీమియం చెల్లింపును నెలవారీ, త్రైమాసికం, ఆరునెలలు ఏడాదికి చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించేందుకు నెలరోజులు గడువుంటుంది. ఈ పథకంపై రుణం కూడా తీసుకోవచ్చు. కొనసాగించలేకపోయినా లేదా ఇష్టం లేకపోయినా మూడేళ్ల తరువాత క్లోజ్ చేసుకోవచ్చు. జీవితాంతం నడిపించాల్సిన అవసరం లేదు. 


Also read: Upcoming Phones June 2023: ఈ నెలలో లాంచ్ కాబోతున్న అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook