ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ కొనే వారికి గుడ్‌న్యూస్.. పండుగ సీజన్ కంటే ముందే ధరలు తగ్గబోతున్నాయి!
AC, Fridge, Washing Machine and TV likely To reduced. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్‌లతో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలో తగ్గవచ్చని తెలుస్తోంది.
Washing Machine and TV likely To reduced due to Manufacturers Input Costs: ఇటీవలి కాలంలో ప్రతి వస్తువు ధర పెరుగుతూనే ఉంది. ధరలు పెరిగాయన్న మాట వినీవినీ ప్రజలకు విసుగొచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె, విద్యుత్ చార్జిలు లాంటివి పెరుగుతూ వచ్చాయి. అయితే వంటనూనెల ధరలు తగ్గడం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉండటం లాంటి వార్తలు ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇవే కాదు హోమ్ అప్లయెన్సెస్ ధరలు కూడా త్వరలోనే తగ్గబోతున్నాయి. పండుగల సీజన్ కంటే ముందే రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషీన్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఓ వేదిక ప్రకారం.. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ మరియు వాషింగ్ మెషీన్‌లతో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలో తగ్గవచ్చని తెలుస్తోంది. ఇన్‌పుట్ కాస్ట్ తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విడి భాగాల ధరలు పెరగడం, ఇన్‌పుట్ కాస్ట్ భారం కావడంతో.. ఇటీవల కంపెనీలు హోమ్ అప్లయెన్సెస్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. 10 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇన్‌పుట్ ఖర్చులు తగ్గుతుండటంతో వీటి ధరల్ని తగ్గించే అవకాశాలున్నాయి.
బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ ఇటీవలి నివేదిక ప్రకారం... రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గరిష్ట స్థాయికి పెరిగిన కాపర్ ధరలు ప్రస్తుతం 21 శాతం చౌకగా మారింది. అదే సమయంలో స్టీల్ ధరలు 19 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అల్యూమినియం ధర ఏకంగా 36 శాతం తగ్గింది. దాంతో రిఫ్రిజిరేటర్, కూలర్, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్ మొదలైన హోమ్ అప్లయెన్సెస్ తయారు చేసే కంపెనీల ధర (ఇన్ పుట్ కాస్ట్) తగ్గుతుంది.
ఇన్‌పుట్ ఖర్చులు తగ్గి, మార్జిన్లు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్‌లు తయారుచేసే కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత పండుగ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ కంపెనీలకు అంతకు ముందుగానే మంచి రోజులు రానున్నాయి. అందుకే కస్టమర్లు ఎప్పటికప్పుడు డిస్కౌంట్, ఆఫర్స్ చెక్ చేస్తూ ఉంటే.. తక్కువ ధరలకు కావాల్సిన వస్తువు సొంతం చేసుకోవచ్చు.
Also Read: Maa Neella Tank Trailer: దారుణం జరిగే ఊరేనా ఇది.. నేనొచ్చి పీకేదేముంది నా..!
Also Read: Ysrcp Plenary: రాబోయేది మన ప్రభుత్వమే..వైసీపీ అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నిక..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook