Best Business Ideas For Women: ఈ బిజినెస్ మహిళలు చేయడానికి చాలా సులభతరంగా ఉంటుంది. మహిళలు ఈ బిజినెస్ ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతి నెలా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మహిళలు ఈ బిజినెస్ కోసం ముందుగా మీరు పెట్టాల్సిన పెట్టుబడి కేవలం 10000 నుంచి 20 వేల రూపాయలు మాత్రమే. ఏ బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సమయం వృధా అవ్వకుండా త్వర త్వరగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీని ఆసరాగా చేసుకొని అనేక రకాల ఫుడ్ బిజినెస్ లను మనం చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఫుడ్ బిజినెస్ కు మంచిది. ఇందులో భాగంగా మీరు ఇడ్లీ పిండి, దోస పిండి బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ రకం బిజినెస్ లో ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు సైతం ప్రవేశించాయి. మీరు కూడా ఈ బిజినెస్ లో వినూత్నంగా ఆలోచిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు ఈ బిజినెస్ కోసం వెట్ గ్రైండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు, పదివేల నుంచి 20 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇడ్లీ పిండి, దోస పిండి తయారు చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ ప్రారంభించుకోవచ్చు. వీటి ప్యాకింగ్ కోసం ఉపయోగించుకోవాలి. 


Also Read: Reliance Share Price: రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ స్టాక్ ..9 రోజుల్లో 55శాతం జంప్   


ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే.. మీరు తయారు చేసిన ఇడ్లీ పిండి, దోశ పిండి విక్రయించేందుకు మీ ఇల్లు రోడ్డు అభిముఖంగా ఉన్నట్లయితే ఇంటి ముందు చిన్న ఫ్లెక్సీ లేదా బోర్డు పెట్టి ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మబడును అని ప్రజలకు తెలియజేయవచ్చు. లేదంటే ఒక కరపత్రం ద్వారా మీరు ఇడ్లీ పిండి, దోస పిండి విక్రయిస్తామని ఇంటింటికి సమాచారం తెలియజేయవచ్చు. అలాగే ఇడ్లీ పిండి, దోశ పిండి డోర్ డెలివరీ సైతం చేస్తామని తెలపడం ద్వారా మీరు కస్టమర్లను ఆకర్షించవచ్చు. 


ఏ రంగంలో అయినా పెట్టుబడి డబ్బు మాత్రమే కాదు.. క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైనది. మీ బిజినెస్ పెరిగే కొద్దీ క్వాలిటీ విషయంలో, ప్యాకింగ్ విషయంలోనే ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు. అప్పుడే మీరు ఈ రంగంలో చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీలను తట్టుకొని నిలబడాలంటే.. మీరు వినూత్నమైన మార్కెటింగ్ టెక్నిక్లను ఉపయోగించాల్సి ఉంటుంది. సమీపంలో ఉన్న కిరాణా షాపుల్లో సైతం ఇడ్లీ పిండి, దోశ పిండిని అందుబాటులో ఉంచాలి. ఇక ప్యాకింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి ప్యాక్ మీద కూడా మీరు తయారు చేసిన తేదీని రాసి పెట్టాలి. అప్పుడు కస్టమర్కు మీరు ఒక క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుంది. ఈ బిజినెస్ సక్సెస్ అయినట్లయితే మీకు ప్రతి నెల మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.


Also Read: Best Electric Cars: దసరా  పండక్కి ఎలక్ట్రిక్  కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 10లక్షల లోపు లభించే కార్లు ఇవే  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.