కొత్త ఏడాది ప్రారంభమవుతూనే బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు పెంచుతూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీను 0.35 శాతం పెంచేసింది. ఫలితంగా రుణాలు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచి అమలు కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెపో రేటులో 2.25 శాతం పెరుగుదల


ఒక రోజు ఎంసీఎల్ఆర్‌ను 7.50 శాతం నుంచి 7.85 శాతం పెంచేసింది. అటు ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక ఏడాది ఎంసీఎల్ఆర్‌ను 0.20 శాతం పెంచి 8.25 శాతం చేయగా, 8.35 శాతం, 8.50 శాతం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది మే నుంచి రెపో రేటులో 2.25 శాతం పెంచింది. డిసెంబర్ 7, 2022న రెపో రేటులో చివరిసారిగా 0.35 శాతం చొప్పన పెంచింది. 


మరోవైపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎఫ్‌డి జమ చేసేందుకు 0.45 శాతం వరకూ మార్చింది. ఈ మార్పు తక్షణం అమలు కానుంది. అదే సమయంలో దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఐలకు 444 రోజులకు జమయ్యే మొత్తంపై 7.75 శాతం వడ్డీ లభించనుంది. విదేశీమారకం జమపై కూడా వడ్డీ 1 శాతం పెంచింది.


Also read: Pan card: పాన్‌కార్డు ఎన్ని రకాలు, పాన్‌కార్డు పోతే తక్షణం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook