రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ ఎయిర్‌లైన్ `ఆకాశ` రెండు భారీ డీల్స్!
Rakesh Jhunjhunwala: బడ్జెట్ విమానయాన సంస్థగా దేశీయ మార్కెట్లోకి రానున్న `ఆకాశ ఎయిర్‌లైన్స్` రెండు భారీ డీల్స్ కుదుర్చుకుంది. విమానాల కోసం బోయింగ్‌తో, వాటి ఇంజిన్లకోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో డీల్స్ కుదిరినట్లు ప్రకటించింది.
Rakesh Jhunjhunwala: ప్రముఖ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రధాన వాటాదారుగా (Big bull Rakesh JhunJhun wala) ఉన్న ఎయిర్‌లైన్ స్టార్టప్ 'ఆకాశ'.. కార్యకలాపాలు ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థగా మార్కెట్లోకి ప్రవేశించనుంది ఈ కంపెనీ.
తాజాగా ఈ కంపెనీ 72 విమానాలను కొనుగోలు చేసేందుకు బోయింగ్‌తో (Akasa Boeing deal) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల కొనుగోలు కోసం తమ మధ్య 9 బిలియన్ డాలర్లు (రూ.66,700 కోట్ల పైమాటే) ఒప్పందం కుదిరినట్లు (Akasa Boeing deal Value) ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలో కనీసం 10 విమానాలను డెలివరీ చేసేలా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.
'737' మాక్స్‌లోని రెండు వేరియంట్లు 737-8, 737-7-200 విమానాల కోసం (Boeing 737 flights) ఆర్డరు పెట్టినట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది.
Also read: 2021-22 క్యూ4లో ఎల్ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్‌యూల ప్రైవేటీకరణ కూడా!
Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర
ఇంజిన్లకోసం మరో డీల్
విమానాల కొనుగోలుతో పాటు మరో డీల్‌ను కూడా కుదుర్చుకుంది ఆకాశ ఎయిర్. దుబాయిలో జరుగుతున్న ఎయిర్‌షోలో.. విమానాలకు కావాల్సిన ఇంజిన్లకోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో (Akasa CFM International deal) మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33 వేల కోట్లు)గా తెలిపింది. దీంతో సీఎఫ్‌ఎం లీప్-1బీ ఇంజిన్లను అందించనుంది.
Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర
ఆకాశ గురించి..
ఈ కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోపే 70 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో చెప్పారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరగనున్నాయని.. అయినా తమ సంస్థ అత్యంత తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించనుందని (RakeshJhunJhun wala on Akasa airlines) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సంస్థలో 40 శాతం వాటా రాకేశ్ ఝున్‌ఝున్ వాలా చేతిలోనే ఉంటుందని సమాచారం. ఆకాశ ఎయిర్ గత నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందింది.
Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?
Also read: బ్లూమ్‌బర్గ్ నివేదిక : అత్యంత ధనిక దేశం ఇప్పుడు అమెరికా కాదు..చైనానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook