Ratan Tata Personal Life: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఇకలేరు. ముంబైలో బుధవారం రాత్రి 11.30 గంటలకు బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రాగా.. ఆయనే స్వయంగా ఖండించారు. అయితే బుధవారం ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటాను బతికించేందుకు వైద్యబృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రతన్ టాటా మరణించినట్లు టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటన విడుదల చేశారు. రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయన వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరంగా ఉన్నారు. చివరి వరకు ఆయన బ్యాచిలర్‌గా ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలంటే కన్నీళ్లు పెట్టించే రతన్ టాటా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా


రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. రతన్ అమ్మమ్మ ఆయనను పెంచి పెద్ద చేశారు. ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేయగా.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాలోని ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. లాస్ ఏంజెల్స్‌‌లో ఓ ఉద్యోగంలో చేరారు. అక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే ఆయన ఓ యువతిలో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దమయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండాలని భావించి అక్కడే జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని రతన్ టాటా అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు రతన్ టాటా లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు అనారోగ్యానికి గురైనట్లు భారత్‌ నుంచి కబురువచ్చింది. దీంతో ఆయన ఇక్కడికి వచ్చేశారు. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోయారు. తనే సర్వస్వం అనుకున్న ప్రేయసి కూడా భారత్‌కు వస్తుందని ఆయన అనుకున్నారు. ఆమె కోసం చాలా రోజులు ఎదురు చూశారు. కానీ ఆమె రాలేదు. రతన్ టాటా ఇక్కడ ఉన్న సమయంలోనే (1962లో ) భారత్-చైనా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధమే వారి ప్రేమకు విలన్‌గా మారింది. యుద్ధం భయంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపించేందుకు ఒప్పుకోలేదు.


దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఆమెతోనే జీవితం పంచుకుందామనుకుని ఎన్నో కలలుకన్నారు రతన్ టాటా. కానీ అలా జరగలేదు. ఈ విషయంలో ఆయన ఎవరినీ నిందించలేదు. ఈ ఘటన తర్వాత రతన్ టాటాకు పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని పూర్తిగా వ్యాపారం, సామాజిక సేవకు అంకితం చేశారు. రతన్ టాటాకు మరో మూడు ప్రేమ కథలు ఉన్నాయని చెబుతారు కానీ వాటిపై క్లారిటీ లేదు. బాలీవుడ్ నటి సిమి గారేవాల్‌తో లవ్ జర్నీ చాలా దూరం సాగిందని.. కానీ పెళ్లి వరకు చేరుకోలేదని చెబుతారు. 


Also Read: Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి