RBI: రుణ గ్రహీతలకు చేదువార్త, వడ్డీరేట్లు యథాతధం
ప్రస్తుత త్రైమాసికానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం నిరాశ కల్గిస్తోంది. వడ్డీరేట్లను తగ్గించకపోగా..అదే పాలసీను కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించడం రుణ గ్రహీతలకు చేదువార్తే.
ప్రస్తుత త్రైమాసికానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India ) తీసుకున్న నిర్ణయం నిరాశ కల్గిస్తోంది. వడ్డీరేట్లను తగ్గించకపోగా..అదే పాలసీను కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించడం రుణ గ్రహీతలకు చేదువార్తే.
ఆర్బీఐ ( RBI ) తాజా నిర్ణయం చాలామందిని నిరాశపర్చింది. వడ్డీరేట్లను తగ్గించకుండా యధావిధిగా 4 శాతంగా ఉంచింది. గృహ, ఆటో రుణాలు తీసుకునేవారికి, ఇప్పటికే తీసుకున్నవారికి ఇది కచ్చితంగా చేదువార్తే. ద్రవ్యపరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ( Governor Sakthi kantha Das ) ఇవాళ వెల్లడించారు. వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని..పాతవే కంటిన్యూ అవుతాయన్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపోలో ఎలాంటి మార్పు ( No Change in Interest rates ) చేయలేదని చెప్పారు ఆర్బీఐ గవర్నర్. మూడో త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. 2021 సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం తగ్గనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. సెప్టెంబర్‌లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా మూడవ, నాల్గవ త్రైమాసికంలో తగ్గుతుందని అంచనా వేశామన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. స్వదేశీ లావాదేవీలను వేగంగా నిర్వహించేందుకు ఈ ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటలు ఆర్టీజీఎస్ సేవలను అందించనున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. Also read: TCS Record: యాక్సెంచర్ అధిగమించి విలువైన కంపెనీగా ఖ్యాతి, ఉద్యోగుల వేతనాలు పెంపు