Bank Account: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారా..? ఇలా తిరిగి పొందండి
Reserve Bank Of India: మనం మనీ ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కొసారి పొరపాటు జరిగి ఇతరుల అకౌంట్లో డబ్బు వెళుతుంటుంది. ఇలాంటి సమయంలో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోయి మీ డబ్బును తిరిగి అకౌంట్లోకి పొందండి.
Reserve Bank Of India: ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బ్యాంకులకు వెళ్లే పనిలేకుండా పోయింది. ఇక మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్ వచ్చిన తరువాత ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వినియోగం కూడా బాగా తగ్గిపోయింది. అయితే కొందరు ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు.. సేఫ్‌గా డబ్బు పంపించేందుకు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌నే వాడుతున్నారు. అయితే మనం బ్యాంకు ఖాతా నుంచి డబ్బును బదిలీ చేస్తున్నప్పుడు.. ఖాతా నంబర్, పేరు, ఇతర విషయాలను చాలాసార్లు చెక్ చేసి పంపిస్తాం. కానీ ఒక్కోసారి పొరపాటు జరగవచ్చు.
ఇలా పొరపాటుతో మరోకరి ఖాతాలోకి నగదు జమ అవుతుంది. మరి ఇలా చేస్తే మన డబ్బు ఎలా తిరిగి పొందాలి..? ఇంతకుముందు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని జరిగితే దాని కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బ్యాంకుకు సంబంధించిన చాలా పనులు మీ మొబైల్‌లోనే జరుగుతున్నాయి.
ముందుగా ట్రాన్స్‌క్షన్ గురించి బ్యాంకుకు సమాచారాన్ని మీ బ్యాంకుకు ఇవ్వండి. ఈ సమాచారాన్ని బ్యాంకు ఫోన్ చేసి చెప్పొచ్చు. లేదంటే ఈ మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వచ్చు.
ఈ సమయంలో డబ్బు బదిలీ చేసిన బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది. మీకు ఖాతా ఉన్న బ్యాంకు మీకు పెద్దగా సహాయం చేయదు. మీరు బ్యాంకుకు సమాచారం ఇచ్చినప్పుడు.. లావాదేవీ తేదీ, సమయం, లావాదేవీ ఖాతా నంబర్, పొరపాటున డబ్బు బదిలీ చేసిన ఖాతా నంబర్ వంటి లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వండి. పంపినవారు, డబ్బును స్వీకరించే వారి ఖాతా ఒకే బ్యాంక్‌లో ఉంటే.. దాని ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.
కానీ రిసీవర్ ఖాతా వేరే బ్యాంకులో ఉంటే.. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు పొరపాటున ఎవరి బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేశారో కూడా మీరు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. బ్యాంకులు తమ ఖాతాదారుల సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవు. అలాగే కస్టమర్ అనుమతి లేకుండా ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయలేవు. చాలా సందర్భాలలో డబ్బును స్వీకరించే వ్యక్తి డబ్బును తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అతను డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే.. మీరు అతనిపై కూడా కేసు నమోదు చేయవచ్చు.
Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook