RBI imposed penalty of Rs 1 crore on SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ (భారతీయ స్టేట్ బ్యాంక్)కు భారీ షాక్ తగిలింది. నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ జరిమానా (RBI Fine on SBI) విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జరిమానా ఎందుకు?


ఏదైన బ్యంక్​ నుంచి రుణాలు పొందిన కంపెనీల్లో.. 30 శాతంకన్నా ఎక్కువ షేర్లను అదే బ్యంకు వద్ద ఉంచుకోకూడదని ఆర్​బీఐ నిబంధన విధించింది. అయితే ఎస్​బీఐ ఆ నిబంధనను ఉల్లంగించి రుణ గ్రహిత కంపెనీల్లో 30 శాతం కన్నా ఎక్కువ పెయిట్-అప్​ షేర్ అట్టె పెట్టుకున్నట్లు (SBI Violat Banking norms) గుర్తించి ఈ జరిమానా విధించింది ఆర్​బీఐ. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్​ 19 సబ్​ సెక్షన్​ (2) ప్రకారం ఈ జరిమానా వేసినట్లు పేర్కొంది ఆర్​బీఐ.


2018 మార్చి 31 నుంచి 2019 మార్చి 31 మద్య కాలానికి సంబంధించి బ్యాంక్ ఆర్థిక స్థితిపై ఆర్​బీఐ ఇటీవల తనిఖీ చేపట్టింది. రిస్క్ మదింపు నివేదికలను పరీశీలించింది. ఈ తనిఖీల్లోనే ఎస్​బీఐ నిబంధనలను (SBI fined by RBI) ఉల్లంఘించినట్లు గుర్తించింది ఆర్​బీఐ.


జరిమానా విధించకముందే.. పెనాల్టీ ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఎస్​బీఐకి నోటీసులు జారీ చేసింది ఆర్​బీఐ. దీనికి ఎస్​బీఐ నుంచి వచ్చిన స్పందనను పరిగణలోకి తీసుకున్న తర్వాతే రూ.కోటి జరిమానా విధింంచినట్లు స్పష్టం చేసింది.


Also read: Sovereign Gold Bonds: సోమవారం నుంచి సార్వ‌భౌమ గోల్డ్ బాండ్ల ఇష్యూ షురూ


Also read: Free insurance offers: మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా Credit card ఉందా ? అయితే ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉన్నట్టేనట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook