Bank Holidays July: జూలై నెలలో బ్యాంకు సంబంధిత పనులున్నాయా..అయితే ఇది మీ కోసమే. జూలైలో ఏకంగా 16 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై నెల ప్రారంభమైంది. బ్యాంకు పనులుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవల్సిందే. ఎందుకంటే ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకుల సెలవుల జాబితా వచ్చేసింది. జూలై నెలలో 16 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవులు జాబితా మూడు కేటగరీల్లో ఉంది. ఇందులో నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ ఎక్కౌంట్స్ ఉన్నాయి. నేషనల్ హాలిడేస్‌తో పాటు కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఇందులో అన్ని ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి. జూలై నెలలో ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులున్నాయో చూద్దాం..


జూలై 1                        భువనేశ్వర్, ఇంఫాల్‌లో సెలవు
జూలై 3                        ఆదివారం
జూలై 5 2022               మంగళవారం..గురు హర్‌గోవింద్ ప్రకాశదినం...జమ్ము కశ్మీర్
జూలై 6  2022              బుధవారం..ఎంహెచ్ఐపీ రోజు, మిజోరాం
జూలై 7                        ఖర్చా పూజా...అగర్తలలో సెలవు
జూలై 9                        రెండవ శనివారం, బక్రీద్
జూలై 10                      ఆదివారం
జూలై 11                      జమ్ము కశ్మీర్‌లో సెలవు
జూలై 13                      భాను జయంతి, గ్యాంగ్‌టెక్‌లో సెలవు
జూలై 14                      షిల్లాంగ్‌లో బ్యాంకు సెలవు
జూలై 16                      హరేలా, డెహ్రాడూన్‌లో సెలవు
జూలై 17                      ఆదివారం సెలవు
జూలై 23                      నాలుగవ శనివారం
జూలై 24                      ఆదివారం సెలవు
జూలై 26                     కేర్ పూజా, అగర్తలలో బ్యాంకు సెలవు
జూలై 31                     ఆదివారం సెలవు


Also read: Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్... రేపటి నుంచి ఆఫర్ల జాతరే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook