RBI New Guidelines to Banks On Property Documents: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ల విషయంలో బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రాపర్టీ పెట్టి లోన్లు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. లోన్లను సరైన సమయంలో చెల్లించిన వారికి నెల రోజులలోపు ఒరిజనల్ డాక్యుమెంట్లను అందజేయాలని స్పష్టం చేసింది. లోన్ మొత్తం చెల్లించినా.. ఒరిజనల్ డాక్యుమెంట్లను వినియోగదారులకు ఇవ్వకుండా కొన్ని బ్యాంకులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ఆర్‌బీఐ వినియోగదారులకు ఊరట కలిగించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర నియంత్రిత సంస్థల నుంచి రుణగ్రహీతలకు సకాలంలో డాక్యుమెంట్లను అందించకుంటే.. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. కొత్త నిబంధన డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా డాక్యుమెంట్లు జారీ చేయడంలో జాప్యం జరిగితే.. రోజుకు రూ.5 వేల జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. జరిమానా మొత్తాన్ని సంబంధిత ఆస్తి యజమాని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా వినియోగదారుడికి సంబంధించి ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటే.. జిరాక్స్ కాపీలను పొందేందుకు బ్యాంకులు సహాయం చేయాలని సూచించింది. 


 




ఒరిజినల్ ఆస్తి పత్రాలను అందించడలో జాప్యం జరిగితే.. లేదా రుణం సెటిల్‌మెంట్ చేసిన తర్వాత 30 రోజులకు మించి సంబంధిత రిజిస్ట్రీతో ఛార్జ్ సంతృప్తి ఫారమ్‌ను దాఖలు చేయడంలో విఫలమైతే.. ఆర్‌ఈ ఆలస్యానికి గల కారణాలను వినియోగదారలుకు తెలియజేయాలి. కస్టమర్‌కు సమాచారం అందించకపోతే.. ఆలస్యమయ్యే ప్రతి రోజుకు రూ.5 వేల చొప్పున రుణగ్రహీతకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. లోన్ తీసుకునే సమయంలోనే డాక్యుమెంట్ల చెల్లింపు తేదీ, ఎక్కడ తీసుకోవాలనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. వారసులకు డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. 


Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు  


Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి