RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై గురువారం కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను మరో మారు యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. రెండు నెలలకు ఒకసారి చేసే మనీటరీ లివరేజ్ పాలసీపై రివ్యూ చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా ముప్పు ఇంకా తొలగిపోని నేపథ్యంలో.. ద్రవ్యోల్బణం వంటి భయాల కారణంగా ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. 


వరుసగా పదోసారి..


అయితే కీలక వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగించడం ఇదే తొలిసారి కాదు. వరుసగా పదోసారి కీలక వడ్డీ రేట్లను కొనసాగించడం గమనార్హం. కరోనా సంక్షోభం మొదలైన 2020 ఏడాది మే నెలలో రెపో రేటును 4 శాతానికి కుదించినట్లు అప్పట్లో ప్రకటించిన ఆర్బీఐ.. దాన్నే పది దఫాలుగా కొనసాగిస్తూ వస్తుంది.  


Also Read: Flipkart Offers: రూ. 190లకే OPPO 5G స్మార్ట్ ఫోన్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!


Also Read: Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook