Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!

Flipkart TV Days: ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మరో సరికొత్త సేల్ తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ పేరిట ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు కొనసాగనున్న ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. థామ్సన్ కంపెనీకి చెందిన రూ. 43 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు రూ. 16,499కే అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం దాని పూర్తి వివరాలను తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 01:53 PM IST
    • ఫ్లిప్ కార్ట్ టీవీల విక్రయం కోసం స్పెషల్ సేల్
    • ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు కొనసాగనున్న సేల్
    • అతితక్కువ ధరకే అందుబాటులో స్మార్ట్ టీవీలు
Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!

Flipkart TV Days: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సరికొత్త డీల్ తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ పేరిట ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు లభిస్తోంది. 50-అంగుళాల స్మార్ట్ టీవీని కూడా చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 

థామ్సన్ కంపెనీకి చెందిన 50-అంగుళాల స్మార్ట్ టీవీ (థామ్సన్ 9R PRO 50 అంగుళాల 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ) చాలా తక్కువ ధరకే ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. రూ.16,499 ధరకే 50 అంగుళాల టీవీని మీరు కొనుగోలు చేయవచ్చు. 

Thamson 9R PRO స్మార్ట్ టీవీపై ఆఫర్లు

థామ్సన్ 9R PRO 50 అంగుళాల స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 42,999. అయితే ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ సేల్ లో 30 శాతం తక్కువ ధరతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత థామ్సన్ 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 29,999లకే అందుబాటులోకి వస్తుంది. 

ఈ కొనుగోలులో ఇతర బ్యాంకుల కార్టులను వినియోగించడం ద్వారా అత్యధికంగా రూ. వేయి డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. కొటాక్ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్టును వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 1,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ రూ. 27,499 వద్ద ఉంటుంది.  

వీటితో పాటు మీ పాత టీవీని ఎక్స్ఛైంజ్ చేయడం వల్ల అత్యధికంగా రూ.11 వేలు ఆఫర్ పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ధర అనేది మీ టీవీ కండిషన్ ను బట్టి వర్తిస్తుంది. ఈ రూ.11 వేల తగ్గింపు తర్వాత థామ్సన్ 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 16,499లకే అందుబాటులోకి వస్తుంది.  

Also Read: iPhone 13 Price Drops: రూ.74,900 విలువైన ఐఫోన్ 13ను రూ.52,305కే కొనండిలా!

Also Read: Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News