Reserve Bank Of India : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   ద్రవ్యపరపతి విధానకమిటీ సమీక్షలో భాగంగా రేపోరేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడో సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈసారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని  ప్రకటించారు. రేపో రేటు 6.5శాతంతో యథాతథంగా ఉంటుందని..బ్యాంకు రేటు 6.75శాతంగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది వరుసగా తొమ్మిదివసారి. ఆర్బిఐ రేపోరేటు చివరిగా 2023 ఫిబ్రవరి నెలలో చివరిసారిగా రెపోరేటును పెంచిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెపో రేటు అంటే ఏంటి? 


మనలో చాలా మంది డబ్బులు చేతిలో లేనప్పుడు బంగారం కానీ, ఇతర విలువైన పత్రాలు బ్యాంకులో తనఖా పెట్టి బ్యాంకుల వద్ద లోన్ తీసుకుంటారు. ఈ లోన్ పై వడ్డీని కడుతుంటారు. అయితే బ్యాంకుల దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉండవు. ఆ సమయంలో ఈ బ్యాంకులు ఆర్థిక సహాయం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐని ఆశ్రయిస్తాయి. ఈ కమర్షియల్ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ నుంచి నగదు తీసుకుంటాయి. ఈ నగదుపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటును రెపోరేటు అంటారు. 


Also Read : Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు  


ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకొచ్చే ప్రయత్నాలు: 


ఇక ద్రవ్యోల్బణం విషయంలో ఆర్‌బీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశీయ అభివృద్ధిలో స్థిరమైన వేగం ఉందని.. సేవారంగం పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి చేర్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని..అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా గృహ ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పారు. 


కాగా ఆర్బిఐ రేపోరేటను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణగ్రహీతలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.ఒక వేళ రేపో రేట్లు తగ్గించనట్లయితే   హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ తగ్గుతాయని రుణగ్రహీతలు భావించారు. తద్వారా ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుందని భావించారు. ప్రస్తుతం బ్యాంకులు రేపోరేటు లింక్ తోనే ఈ లోన్స్ ఇస్తున్నాయి. తద్వారా రేపోరేట్లకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో బ్యాంకులు స్థిరమైన వడ్డీరేట్లకు లోన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఫ్లోటింగ్ ప్రాతిపదికన రుణాలు అందిస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరూ రేపోరేట్లపై ఫోకస్ పెడుతున్నారు. 


Also Read : Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter