2023 జనవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులున్నాయి. రెండవ శనివారం, ఆదివారాలతో పాటు , రాష్ట్రీయ, జాతీయ సెలవులున్నాయి. అందుకే బ్యాంకు పనులుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023లో చాలా మార్పులు రానున్నాయి. దాంతోపాటు వివిధ ప్రాంతాల్లో కొత్త ఏడాది పురస్కరించుకుని కొన్ని మార్పులుంటాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా జనవరి నెలలో బ్యాంకు పనులుంటే కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జనవరిలో బ్యాంకులకు సెలవులు ఎక్కువే ఉన్నాయి. ఆర్బీఐ జనవరి నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా చెక్ చేసుకుని..అందుకు తగ్గట్టుగా మీ బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి 2023లో బ్యాంకు సెలవులు ఎప్పుడనేది చూద్దాం..


జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ఇందులో రెండవ శనివారం, ఆదివారాలున్నాయి. ప్రతి నెల తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఇందులో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. ఆర్బీఐ ఈ సెలవుల్ని మూడు కేటగరీల్లో విభజించింది. హాలిడే అండర్ నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే ప్రకారం ఉన్నాయి. 


జనవరి 2023లో బ్యాంకు సెలవుల జాబితా
Bank Holidays list in January2023


1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్
2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకలు ఐజ్వాల్‌లో సెలవు
3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు
4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ నగాయీ సెలవు
8 జనవరి 2023 ఆదివారం
14 జనవరి 2023 రెండవ శనివారం
15 జనవరి 2023 ఆదివారం
16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం చెన్నైలో సెలవు
17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు చెన్నైలో సెలవు
22 జనవరి 2023 ఆదివారం
23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం పశ్చిమ బెంగాల్‌లో సెలవు
26 జనవరి 2023 రిపబ్లిక్ డే హాలిడే
28 జనవరి 2023 నాలుగవ శనివారం
29 జనవరి 2023 ఆదివారం


Also read; New Rules: కొత్త ఏడాదిలో మారనున్న నిబంధనలు.. పూర్తి వివరాలు ఇవిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook