Paytm Services: మార్చ్ 15 తరువాత పేటీఎంలో ఏ సేవలు పనిచేస్తాయి, ఏవి పనిచేయవు
Paytm Services: పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మార్చ్ 15 తరువాత పేటీఎం సేవలు ఏవి పనిచేస్తాయి, ఏవి పనిచేయవనే విషయంలో స్పష్టత లేకపోవడంలో జనంలో సందిగ్దత నెలకొంది.
Paytm Services: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించడంతో మార్చ్ 15 తరువాత ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనిచేయదు. వాస్తవానికి ఫిబ్రవరి 29తోనే గడువు ముగిసినా ఆ తరువాత ఆర్బీఐ 15 రోజులు గడువు పొడిగించింది. మార్చ్ 15 తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. ఇంకా చాలా సేవలు పనిచేయవు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆర్బీఐ ఆంక్షల నేపధ్యంలో మార్చ్ 15 తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనిచేయదు. ఒకవేళ పేటీఎం బ్యాంకులో ఏమైనా డబ్బులుంటే మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. అయితే ఏయే సేవలు కొనసాగుతాయి, ఏయే సేవలు కొనసాగవనే విషయంపై సందిగ్దత ఉంది. పేటీఎం మొత్తానికే పనిచేయదా లేక కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే పనిచేయదా అనేది చాలామందికి తెలియడం లేదు.
పేటీఎంలో ఏవి పనిచేయవు
మార్చ్ 15 తరువాత క్లోజ్ అయ్యే పేటీఎం సేవల్లో ముఖ్యమైంది పేటీఎం ఫాస్టాగ్. ఇందులో ఉన్న డబ్బులే వినియోగించగలరు. ఫాస్టాగ్ రీఛార్డ్ లేదా పేటీఎం వ్యాలెట్ రీఛార్జ్ ఇకపై సాధ్యం కాదు.
మార్చ్ 15 తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో నగదు స్వీకరణ జరగదు. ఈ బ్యాంకు ద్వారా సంబంధిత యూజర్ జీతం లేదా మరేదైనా ప్రయోజనం పొందుతుంటే ఇకపై అది సాధ్యం కాదు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఇకపై డబ్బులు బదిలీ కావు. ఫాస్టాగ్ బ్యాలెన్స్ మరో ఫాస్టాగ్‌కు బదిలీ కాదు.
పేటీఎం సేవల్లో ఏవి పనిచేస్తాయి
పేటీఎం పేమెంట్ బ్యాంక్ వినియోగదారులు వ్యాలెట్ లేదా బ్యాంక్‌లో ఉన్న డబ్బుల్ని విత్ డ్రా చేసుకోగలరు. రిఫండ్, క్యాష్‌బ్యాక్ వంటివి కొనసాగుతాయి. పేటీఎంలో బ్యాలెన్స్ ఉన్నంతవరకూ చెల్లింపులు జరుగుతాయి. పేటీఎం వ్యాలెట్‌ను మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
మార్చ్ 15 తరువాత కూడా పేటీఎం ఫాస్టాగ్ పనిచేస్తుంది కానీ అందులో బ్యాలెన్స్ ఉన్నంతవరకే. బ్యాలెన్స్ అయిపోతే రీఛార్జ్ జరగదు. పేటీఎం ద్వారా నెలవారీ ఓటీటీ చెల్లింపులు కొనసాగుతాయి.
Also read: Tax Saving Tips: ట్యాక్స్ పేయర్లు చేయకూడదని 5 ముఖ్యమైన పొరపాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook