Realme Narzo 30 Pro 5G Online Sale On Flipkart And Realme.com: స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం రియల్ మీ (Realme) సరికొత్త మోడల్స్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. Narzo 30 Series మొబైల్స్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేయగా.. నేటి నుంచి వాటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. తద్వారా Realme Narzo 30A మొబైల్, Narzo 30 Pro మోడల్ స్మార్ట్‌ఫోన్లు విక్రయాలు ప్రారంభిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనదేశంలో లాంచ్ అయిన అత్యంత చవకైన 5జీ ఫోన్లను రియల్ మీ లాంఛ్ చేయడం గమనార్హం. అతి తక్కువ ధరలకు మార్కెట్‌లోకి వస్తున్న 5G స్మార్ట్‌ఫోన్లు నేటి (ఫిబ్రవరి 04) మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కనుక ఆసక్తిగల కస్టమర్లు  ఫ్లిప్ కార్ట్ (Flipkart) మరియు రియల్ మీ.కామ్ (Realme Website)లలో కొనుగోలు చేయవచ్చు. 


Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు
 
రియల్ మీ నార్జో 30 ప్రో 5జీ ఫీచర్లు ఇవే (Realme Narzo 30 Pro 5G specifications)
- రియల్ మీ నార్జో 30 ప్రో 6.5 అంగుళాల FHD+ display
- 8 GB ర్యామ్, మరియు 128 GB అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
- డ్యూయల్ సిమ్ (dual-SIM) సపోర్ట్ చేస్తుంది
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 48 MP రియర్ కెమెరా సెన్సార్
- సెల్ఫీల కోసం 16 MP సెల్ఫీ ఫ్రంట్ కెమెరా
- బ్యాటరీ సామర్థ్యం 5,000 mAh
- 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- Sword Black మరియు Blade Silver కలర్స్‌లో లభ్యం కానుంది
- 5జీ, 4జీ LTE, WIFI, బ్లూటూత్ వీ5.1, 
- యూఎస్‌బీ టైప్-C పోర్ట్


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు | Silver Price Today


భారత్‌లో రియల్ మీ నార్జో 30 ప్రో 5G ధర (Realme Narzo 30 Pro 5G Price)
రియల్ మీ నార్జో 30 ప్రో 5G రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి 6 GB RAM+ 64 GB స్టోరేజ్ వేరియంట్, కాగా, రెండోది 8 GB RAM + 128 GB స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉంది. 
6 GB RAM+ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. 8 GB RAM+ 128 GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ.19,999గా ఉంది. Flipkart మరియు Realme.comలలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook