Realme Narzo 60 5G Review: ఫోన్‌లో వచ్చే డీఫాల్ట్ యాప్స్, ఎక్కువ మెమొరీ ఉండే ఇతర యాప్స్, హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ గ్యాలరీ, సినిమాలు, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్.. ఇవన్నీ కలిపి డేటా అధికం అవుతుండడంతో స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ మెమరీని తినేస్తున్నాయి. దీంతో 256GB స్టోరేజ్ ఫోన్ అయినా సరే.. అవి కొద్ది రోజుల్లోనే ఫుల్ మెమొరీ అని వస్తోంది. Micro SD కార్డ్ ఉపయోగించినప్పటికీ స్టోరేజీ సరిపోని పరిస్థితి ఉంటోంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి వచ్చిందే ఈ కొత్త స్మార్ట్ ఫోన్. రియల్‌మి నార్జో 60 5G ఫోన్ 1TB ఇంటర్నల్ మెమొరీ  అందిస్తోంది. కేవలం హై డేటా స్టోరేజ్ మాత్రమే కాదు.. మరెన్నో క్వాలిటీ ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్‌మి నార్జో 60 5G ఫోన్ రివ్యూ, ధర, కలర్ వేరియంట్స్ విషయానికొస్తే..
రియల్‌మి నార్జో 60 5G ప్రో ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. అందులో ఒకటి మార్స్ ఆరెంజ్ కాగా.. మరొకటి కాస్మిక్ బ్లాక్ కలర్. ర్యామ్, స్టోరేజ్‌లోనూ ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 26,999 గా ఉంది. అలాగే 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 29,999 లకు లభిస్తోంది. 


రియల్‌మి నార్జో 60 ప్రో 5G డిజైన్ రివ్యూ :
రియల్‌మి నార్జో 60 ప్రో 5G ఫోన్ వెనుక భాగంలో వెగన్ లెదర్‌తో డిజైన్ చేశారు. వెనుక పై భాగంలో మధ్యలో పెద్దగా సర్కిల్ షేపులో కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా సెటప్ ఈ ఫోన్‌ని మరింత ప్రత్యేకం చేయనుంది. అద్భుతమైన సౌండ్ క్లారిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్ కూడా ఉన్నాయి. 


రియల్‌మి నార్జో 60 ప్రో 5G డిస్‌ప్లే రివ్యూ : 
నార్జో 60 ప్రో 6.7 అంగుళాలతో కర్వ్‌డ్ OLED డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్‌టైన్మెంట్ కూడా మరింత సరదాగా ఉంటుంది అని రియల్‌మి చెబుతోంది. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్ మ్యాగ్జిమం వాల్యూమ్‌ యాడెడ్ ప్లస్ పాయింట్. డిస్‌ప్లేపై ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కూడా అత్యంత వేగంగా పనిచేస్తుంది.


రియల్‌మి నార్జో 60 ప్రో 5G సాఫ్ట్‌వేర్ రివ్యూ : 
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో నడిచే ఈ రియల్‌మి నార్జో 60 ప్రో 5G ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీతో రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ ఫోన్ గేమింగ్‌కి కూడా పనికొస్తుంది. 


రియల్‌మి నార్జో 60 ప్రో 5G బ్యాటరీ, ఛార్జింగ్ రివ్యూ :
రియల్‌మి నార్జో 60 ప్రో 5G ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జర్‌తో 47 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతం చార్జింగ్ చేయొచ్చు.


ఇది కూడా చదవండి : Redmi 12 5G Phone: తక్కువ ధరలో వస్తోన్న 256GB వేరియంట్ ఫోన్ 


రియల్‌మి నార్జో 60 ప్రో 5G కెమెరా రివ్యూ :
రియల్‌మి నార్జో 60 ప్రో 5Gలో 100MP ప్రైమరీ కెమెరా , 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. లో లైట్లోలోనూ మంచి ఫోటోలను తీయగలదు. వెనుక కెమెరా 4K రేటుతో 60fps రికార్డింగ్‌ ఫీచర్ కూడా ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరా ఉంది. సోషల్ మీడియాకు అనుగుణంగా ఫోటోలు తీసే పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు రియల్‌మి చెబుతోంది.


ఇది కూడా చదవండి : Smartphones Launching in August 2023: ఆగస్టులో లాంచ్ అవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి