Redmi Note 11 Pro launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి కొత్తగా రెండు మోడల్స్ ప్రవేశపెట్టనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రెండు వేరియంట్లు మరో రెండు వారాల్లో ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి రెడ్‌మి నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్భుతమైన ఫీచర్లు కలిగిన రెడ్‌మి నోట్ 11 ప్రో, రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ వేరియంట్లు ఇండియన్ మార్కెట్‌లో మార్చ్ 3న ఎంట్రీ కానున్నాయి. అంటే మరో రెండు వారాల్లో అద్భుత ఫీచర్లు కలిగిన రెండు మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో రానున్నాయి. 


రెడ్‌మి నోట్ 11, నోట్ 11ఎస్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మి నోట్ 11 ప్రో లో రెండు వేరియంట్లు ప్రవేశపెట్టబోతోంది. మార్చ్ 9వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు ఓ ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ కానున్నాయి.


రెడ్‌మి నోట్ ప్రో, ప్రో ప్లస్ ప్రత్యేకతలు, ధర


రెడ్‌మి నోట్ 11 ప్రో..120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 5 ప్రొటెక్షన్, 6.67 ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో 6 జిబి, 8జిబి ర్యామ్‌తో 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌లతో వస్తోంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాంతో 1 టీబీ వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు. బ్యాక్ కెమేరా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఇక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా, 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక ప్రో ప్లస్ మోడల్‌లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ 5జి కనెక్టివిటీ సపోర్ట్ ఇస్తుంది. కెమేరా సిస్టమ్ 3 సెన్సార్‌లతో పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్ల ధర 16 వేల 499 రూపాయలుండవచ్చు. అంటే రెడ్‌మి మోడల్ 11 ఐ కంటే తక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. రెడ్‌మి ప్రో ప్లస్ మాత్రం 20 వేల వరకూ ఉండవచ్చని అంచనా.


Also read: Jio vs VI vs Airtel vs BSNL: జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. వీటిలో ఏ ప్లాన్ బెటర్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook