దేశీయ రిటైల్ వ్యాపారంలో ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడు పెంచింది. జర్మనీ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను 2, 850 కోట్ల రూపాయల భారీ డీల్‌తో దక్కించుకుంది. 2023 మార్చ్ నాటికి పూర్తి కానున్న డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెట్రో ఇండియా నేపధ్యం


మెట్రో ఇండియా 2003లో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 రిటైల్ స్టోర్స్  కలిగి ఉంది. మొత్తం 3500 మంది సిబ్బందితో హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న రిటైలర్లతో వ్యాపారం నిర్వహిస్తోంది. క్యాష్ అండ్ క్యారీ విధానంలో ఇండియాలో వ్యాపారం ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే కావడం విశేషం. 19 ఏళ్ల నుంచి మెట్రో ఇండియా పేరుతో వ్యాపారం సాగిస్తున్న కంపెనీ 30 లక్షలమంది కస్టమర్లను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్ వరకూ కంపెనీ 7,700 కోట్ల విక్రయాలు చేపట్టింది. ఇండియాలో మెట్రోకు ఇదే రికార్డు స్థాయి అమ్మకాలు కావడం గమనార్హం. 


దేశంలోని రిటైల్ రంగంలో మరింత విస్తృతమయ్యేందుకు, చిన్న చిన్న వ్యాపారులు, సంస్థలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో మెట్రో ఇండియాను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. మెట్రో ఇండియా కొనుగోలు ద్వారా భారత కిరాణా మార్కెట్లో ఇప్పటికే ఉన్న తమ సంస్థకు మెట్రో నెట్‌వర్క్ జత చేరితే..దేశంలోని చిన్న చిన్న వ్యాపారులకు మరింత లబ్ది చేకూరుతుందన్నారు. 


ఈ కొనుగోలు ద్వారా దేశంలోని ప్రముఖ నగరాల్లో కిరాణా, ఇతర సంస్థలో వ్యాపారం, బలమైన సరఫరా నెట్‌వర్క్ కలిగి ఉన్న మెట్రో ఇండియా నెట్‌వర్క్‌తో రిలయన్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. 


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నేపధ్యం


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ సంస్థ. ఆర్ఐఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో రిటైల్ వ్యాపారం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 16,500 స్టోర్స్‌తో, 2 మిలియన్ల కస్టమర్లతో కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఎప్పారెల్, ఫార్మసీ, హోమ్ అండ్ ఫర్నీచర్, బ్యూటీ కేర్ విభాగాల్లో వ్యాపారం చేస్తోంది. అదే సమయంలో జియో మార్ట్, ఎజియో, నెట్‌మెడ్స్, జివామె వంటి ఆన్‌లైన్ వ్యాపారాలు కలిగి ఉంది. 2022 మార్చ్ ఏడాదికి 199, 704 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది.


మెట్రో నేపధ్యం


మెట్రో సంస్థ హోటల్, రెస్టారెంట్, కేటరింగ్ విభాగాల అవసరాల్ని తీర్చే ప్రముఖ ఫుడ్ హోల్‌సేలర్. ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 95 వేల సిబ్బందిని కలిగి ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మెట్రో సంస్థ 29.8 బిలియన్ యూరోల అమ్మకాలు సాధించింది. 


Also read: Elon Musk: ట్విట్టర్ సీఈవో పోస్టుకు ఓ మూర్ఖుడు కావలెను..సంచలనం కల్గిస్తున్న ఎలాన్ మస్క్ ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook