Jio New Recharge Plan: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు వివిధ రకాల ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో ఆఫర్ చేసే ప్లాన్స్ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది తక్కువ ధరలో ఎక్కువ లాభాలు కలిగే రీఛార్జ్ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. అటువంటి ప్లాన్స్‌లో రిలయన్స్ జియో ఒకటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో ఇప్పుడు కొత్తగా 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుంటుంది. అంటే 3 నెలలకు పైగా పనిచేస్తుంది. మొత్తం డేటా 196 జీబీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ అన్‌లిమిటెడ్‌గా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ కాంప్లిమెంటరీగా అందుకోవచ్చు. జియో సినిమా ప్రీమియం మాత్రం లభించదు. 


అయితే కొంతమంది యూజర్లు ఓటీటీ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. మీక్కూడా ఓటీటీ ప్లాన్స్ కావాలంటే మీ కోసం జియో నుంచి 1049 రూపాయలు, 1299 రూపాయల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 1049 రూపాయల ప్లాన్‌తో సోనీలివ్, జీ5 ఉచితంగా పొందవచ్చు. అదే 1299 రూపాయల ప్లాన్‌తో అయితే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుకోవచ్చు. 


Also read: Mercury Transit 2024: బుధ గోచారం ప్రభావం నవంబర్ 1 నుంచి ఈ 3 రాశులకు అంతా డబ్బే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.