Jio OTT Plans: రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సభ్యత్వం పొందవచ్చు. రిలయన్స్ జియో ప్రారంభించిన ఈ ప్లాన్స్ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లకు వర్తిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్‌పెయిడ్ ఓటీటీ ప్లాన్ ప్రారంభించింది. ఇందులో ఏకంగా 15 ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు. దాంతోపాటు అన్‌లిమిటెడ్ డేటా, వాట్సప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అన్నీ చేయవచ్చు. ఉచితంగా లభించే ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో ముఖ్యమైంది జియో 888 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా సహా మొత్తం 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ డేటా ఉండటం వల్ల రీఛార్జ్ అవసరం లేదు. 


ఇప్పటికే ప్రీ పెయిడ్ ప్లాన్‌లో ఉన్నా సరే..కొత్త 888 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మారవచ్చు. చాలా ఈజీగా పోస్ట్‌పెయిడ్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. ఇందులో వాయిస్ కాలింగ్, మెస్సేజింగ్ సౌకర్యం కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో ఇటీవలే జియో ఐపీఎల్ ధనాధన్ ఆఫర్ ప్రారంభించింది. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే 50 రోజుల క్రెడిట్ ఓచర్ ఉంటుంది. జియో ఐపీఎల్ ధనాధన్ ఆఫర్ మే 31 వరకూ అందుబాటులో ఉంటుంది. 


Also read: Upcoming SUV Cars: దేశంలో క్యూ కట్టనున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook