Jio OTT Offers: రిలయన్స్ జియో లాంచ్ చేసిన ఈ ప్లాన్ జియో 448 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్. ఇందులో రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా 13 ఓటీటీ సేవలు ఉచితంగా అందుతాయి. రోజురోజుకూ ఓటీటీ సేవలు ప్రియంగా మారుతున్న క్రమంగా ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టమర్లను ఆకట్టుకునేందుకు, ఉన్న కస్టమర్లను నిలబెట్టుకునేందుకు రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ లేదా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 448 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ అందించింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇంట్లో 2-3 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కొనుగోలు చేసేవారికి ఇది బెస్ట్. ఎందుకంటే ఇందులో మొబైల్ ప్లాన్‌తో పాటు 13 ఓటీటీలు ఉచితంగా చూడవచ్చు. వాస్తవానికి ఈ ప్లాన్ కొత్తగా వచ్చింది. టారిఫ్ ప్లాన్స్ ధరలు పెరిగిన తరువాత అందుబాటులో వచ్చింది. 175 రూపాయల జియో టీవీ ప్రీమియం ఉచితంగా లభిస్తుంది.


ఈ ప్లాన్ తీసుకుంటే జీ5, సోనీ లివ్, డిస్కవరీ ప్లస్, లయన్స్‌గేట్ ప్లే, కాంచా లాంబా, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, ప్లానెట్ మరాఠీ, ఫ్యాన్‌కోడ్, చౌపల్ వంటి 13 ఓటీటీలను ఉచితంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కాస్త ఖరీదైనా ఓటీటీలను పరిగణలో తీసుకుంటే ఛీపర్ ప్లాన్ అవుతుంది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావాలంటే 29 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. 


అదే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ కావాలంటే మాత్రం 1299 రూపాయలు, 1799 రూపాయల ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండింటి వ్యాలిడిటీ 84 రోజులు


Also read: Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook