Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్
Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల టారిఫ్ ధరలు పెంచినా కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Jio New Recharge Plan: రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే మోస్ట్ పవర్‌ఫుల్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇది 999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 98 రోజులు. ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలలకు పైగా వ్యవధి ఉంటుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఈ ప్లాన్‌లో.
దేశంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ కాకుండా ప్రైవేట్ రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. అన్ని కంపెనీలు వివిధ రకాల టారిఫ్‌లతో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఏ రీఛార్జ్ ప్లాన్ అనేది ఎంచుకోవడం కాస్త కష్టమౌతుంటుంది. చాలామంది ఎకానమీ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. అందుకే వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి టెలీకం కంపెనీలు. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో నుంచి కొత్తగా 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్‌లో చాలా ప్రయోజనాలున్నాయి.
రిలయన్స్ జియో అందిస్తున్న 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులు. ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నెలలకు పైగా వ్యవధి లభిస్తుంది. అంతేకాకుండా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 98 రోజులకు కలిపితే మొత్తం 196 జీబీ డేటా ఉంటుంది. అన్‌లిమిటెడ్ 5జి డేటా ఉంటుంది. ఇతర ప్లాన్స్‌కు ఉన్నట్టే ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత యాక్సెస్ ఉంటుంది. అయితే జియో సినిమా ప్రీమియం మాత్రం ఈ ప్లాన్‌తో లభించదు.
కొంతమంది యూజర్లు ఓటీటీ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. అలాంటి కస్టమర్లకు రిలయన్స్ జియో ఇతర ప్లాన్స్‌తో ఓటీటీ బెనిఫిట్స్ ఇస్తోంది. 1049 రూపాయలు, 1299 రూపాయల ప్లాన్స్ ఇవి. ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 1049 రూపాయల ప్లాన్‌తో సోనీ లివ్, జీ5 లభిస్తే 1299 రూపాయల ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ వస్తుంది.
Also read: Redmi Note 14 Series: రెడ్ మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో మూడు మోడల్స్ లాంచ్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.