Redmi Note 14 Series: రెడ్ మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో మూడు మోడల్స్ లాంచ్, ధర ఎంతంటే

Redmi Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి ఒకేసారి మూడు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మి నోట్ 14 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14 ప్రో, రెడ్‌మి నోట్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మూడు ఫోన్ల ఫీచర్లు, ప్రత్యేకతలు ఓసారి చెక్ చేద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2024, 07:08 PM IST
Redmi Note 14 Series: రెడ్ మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో మూడు మోడల్స్ లాంచ్, ధర ఎంతంటే

Redmi Note 14 Series: Redmi Note 14, Redmi Note Pro, Redmi Note Pro Plus మూడు ఫోన్లను షివోమీ కంపెనీ ఒకేసారి మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్నీ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా బ్రైట్‌నెస్ 2100 నిట్స్ కావడంతో అద్భుతమైన రిజల్యూషన్ కలిగి ఉంటాయి. 

రెడ్‌మి నోట్ 14 బేసిక్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. బ్యాటరీ 5110 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉండి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇందులో 6జీబీ వర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 18,999 రూపాయలుగా ఉంది. ఇక 8జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ అయితే 20,999 రూపాయలుంది. 

ఇక రెడ్‌మి నోట్ 14 ప్రో అయితే 6.67 ఇంచెస్ స్క్రీన్, 1.5 కే ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5500 ఎంఏహెచ్ సామర్ధ్యంతో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తోంది. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. 8జీబీ వేరియంట్, 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 23,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 25,999 రూపాయలుగా ఉంది. 

రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ కూడా 6.67 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండి క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ 6200 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉండి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమేరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 29,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర 31,999 రూపాయులుంది. ఇక 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ అయితే 34,999 రూపాయలుంది. ఈ మూడు మోడల్ ఫోన్ల విక్రయాలు డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. 

Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News