Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసా
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు కొంతమంది కస్టమర్లు ఆకర్షితులయ్యారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన ప్లాన్స్ అందుబాటులో తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాలు వరుసగా రీఛార్జ్ టారిఫ్ పెంచిన నేపధ్యంలో ఏ కంపెనీ ప్లాన్ ఇప్పటికీ తక్కువ ధరకు లభ్యమౌతుందో పరిశీలిద్దాం. ముఖ్యంగా 1 నెల రోజుల వ్యాలిడిటీలో ఏ ప్లాన్ మంచిదో తెలుసుకుందాం. అంటే జియో, ఎయిర్ టెల్, వీఐ కంపెనీల్లో నెల రోజుల వ్యాలిడిటీలో ఏది ఛీప్ అండ్ బెస్ట్ అని చెక్ చేయాల్సి ఉంది.
వోడాఫోన్ ఐడియా 1 నెల రీచార్జ్ ప్లాన్ అంటే 28 రోజుకు వర్తిస్తుంది. 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాలి. ఇందులో యూజర్లకు రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. ఇక దేశంలో ఎక్కడికైనా అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది.
రిలయన్స్ జియో 1 నెల రీఛార్జ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో యూజర్లకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. ఇక దేశంలో ఎక్కడికైనా సరే అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. దీంతోపాటు జయో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.కేవలం 249 రూపాయలకే రీఛార్జ్ చేయించుకోవచ్చు.
ఎయిర్ టెల్ 1 నెల రీఛార్జ్ ప్లాన్ కూడా 28 రోజులకే ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ కోసం 299 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో యూజర్లకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యముంటాయి. అంటే ఇప్పటికీ 1 నెల ప్లాన్ ప్రయోజనాలు పరిశీలిస్తే రిలయన్స్ జియో చౌకగా లభిస్తోంది. ఇతర రెండు కంపెనీల ధరలతో పోలిస్తే రిలయన్స్ జియో 50 రూపాయలు తక్కువకే లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook