Ratan Tata Titan Company: బడ్జెట్‎లో తీసుకున్నఈ ఒక్క నిర్ణయంతో..రతన్ టాటాకు చెందిన ఈ కంపెనీకి లాభాల పంట..!!

Titan Company:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు వర్గాలకు వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బంగారం అలాగే విలువైన లోహాలపై కస్టమ్స్ తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జువెలరీ కంపెనీల షేర్ల ధరలు కూడా ఒక్క సారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో నేరుగా లబ్ధి పొందుతున్న కంపెనీలో టాటా గ్రూపుకు చెందిన టైటాన్ కూడా ఒకటని చెప్పవచ్చు టైటాన్ షేరు ధర ఏకంగా తొమ్మిది శాతం వరకు పెరగటం విశేషం. అదే సమయంలో కళ్యాణ్ జువెలరీస్, సెంకో గోల్డ్ లిమిటెడ్ లాంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి.
 

1 /5

Ratan Tata: బంగారం ధరలు భారీగా పెరగడంతో గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆభరణాల మార్కెట్లో పెద్దగా కదలిక లేకుండా ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దిగుమతి చేసుకునే సంస్థలకు లాభం పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు బంగారం ధరలు తగ్గి రావటం వల్ల కస్టమర్లు కూడా ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో మంగళవారం టైటాన్ కంపెనీ షేరు విలువ రూ .3,490 వరకూ పెరిగింది. మంగళవారం టైటాన్ షేర్లు పెరగడంతో కంపెనీ విలువ దాదాపు రూ.19,000 కోట్లు పెరిగింది.   

2 /5

బంగారు ఆభరణాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా నిన్నటి బడ్జెట్ ప్రకటనతో భారీగా ర్యాలీ చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా టైటాన్ కంపెనీ ఎక్కువగా లాభపడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు గడిచిన ఏడాది కాలంలోనే మల్టీ బాగర్ లాభాలను ఇచ్చాయి.అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టైటాన్ షేర్లకు రెక్కలు వచ్చాయి. బంగారు ఆభరణాలకు సంబంధించిన కంపెనీల షేర్లు రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతన్నారు. టైటాన్ షేర్లు పెరగడంతో ఇన్వెస్టర్లు నేరుగా లాభపడ్డారు.ఇది కంపెనీ వాల్యుయేషన్ పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.   

3 /5

బడ్జెట్‌లో చేసిన ప్రకటన కారణంగా టైటాన్ కంపెనీ మార్కెట్ విలువ రూ.3,07,897 కోట్లకు పెరిగింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 9 శాతం తగ్గిస్తూ ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయం ప్రభావం బులియన్ మార్కెట్‌లో కూడా మంగళవారం సాయంత్రం కిలో వెండి ధర రూ.88,196 నుంచి రూ.84,919కి పడిపోయింది. మరోవైపు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 73,218 నుండి 10 గ్రాములకు రూ. 69,602కి పడిపోయింది. రెండు విలువైన లోహాల ధర MCXలో బాగా పడిపోయింది.

4 /5

టాటా గ్రూపుకు చెందిన టైటాన్ తో పాటు కళ్యాణ్ జువెలరీస్, సెంకో గోల్డ్ అలాగే మరిన్ని ఆభరణాల కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో మంచి లాభాలను అందుకుంటున్నాయి. ఈ ర్యాలీ కొనసాగడానికి ప్రధాన కారణం బంగారం దిగుమతి సుంకాల పైన తగ్గింపు మాత్రమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.   

5 /5

రతన్ టాటా టైటాన్ కంపెనీ దేశ,విదేశాలలో తనిష్క్ బ్రాండ్ షోరూమ్‌లను నిర్వహిస్తోంది.ఇటీవల బంగారం,వెండి ధరలు పెరిగిన తరువాత,ఆభరణాల తయారీ కంపెనీల షేర్లకు కూడా డిమాండ్ పెరిగింది.